గౌరమ్మకు గాజుల శోబ!

‘అయిగిరి నందిని నందితమేదిని...’ అంటూ దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని నవ రూపాల్లో శోభాయమానంగా అలంకరించి భక్తితో పూజించడం తెలిసిందే. అయితే కొన్నిచోట్ల ఆ జగజ్జననిని అచ్చంగా పువ్వులూ పండ్లూ కూరగాయలూ కాసులూ నగలూ గాజులూ..

Updated : 25 Sep 2022 01:24 IST

గౌరమ్మకు గాజుల శోబ!

‘అయిగిరి నందిని నందితమేదిని...’ అంటూ దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని నవ రూపాల్లో శోభాయమానంగా అలంకరించి భక్తితో పూజించడం తెలిసిందే. అయితే కొన్నిచోట్ల ఆ జగజ్జననిని అచ్చంగా పువ్వులూ పండ్లూ కూరగాయలూ కాసులూ నగలూ గాజులూ... ఇలా రకరకాల వస్తువులతోనూ అలంకరిస్తుంటారు. అందులో భాగంగానే కొందరు ఆ జగన్మాతకు గాజుల్నే పట్టుచీరగా కట్టి, రత్నాల నగలుగా పెట్టి, పూలహారాలుగా వేసి, వాటినే ప్రసాదంగానూ పంచుతున్నారు. భక్తులు సైతం ఆ పరాశక్తికి చిట్టి గాజుల దండల్ని పూలమాలలుగా వేస్తూ కానుకలుగా సమర్పిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులోని ఆడి పూరమ్‌ పండగ సందర్భంగా అమ్మవారికి గాజుల అలంకారం తప్పనిసరి. గత కొన్నేళ్లుగా బెజవాడ కనక దుర్గమ్మనీ కార్తిక శుద్ధ విదియనాడు గాజులతో అలంకరిస్తోంది ఆలయ కమిటీ. ఇలా విభిన్న క్షేత్రాల్లో గాజులతో సర్వాంగ సుందరంగా కొలువైన ఆ లోకమాతను చూడ్డానికి రెండు కళ్లూ చాలవనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అందుకే పండగలూ వేడుకల సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో కనిపించే ఆ గాజుల శోభను చూసేందుకు భక్తులు బారులు తీరతారు మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..