అందమైన దీవిలో అనగనగా ఓ ఊరు

ఎత్తైన కొండలే ఇరుపక్కలా రక్షకులుగా నిలబడినట్టూ, సముద్రతీరమే సరిహద్దుగా కనిపిస్తున్నట్టూ ఉన్న ఈ ఊరు ఎంతో అందంగా ఉంది కదూ. ‘సెయింట్‌ హెలెనా’ అనే దీవిలోని ఈ ఊరు అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఉంది.

Updated : 08 Jan 2023 05:12 IST

అందమైన దీవిలో అనగనగా ఓ ఊరు

త్తైన కొండలే ఇరుపక్కలా రక్షకులుగా నిలబడినట్టూ, సముద్రతీరమే సరిహద్దుగా కనిపిస్తున్నట్టూ ఉన్న ఈ ఊరు ఎంతో అందంగా ఉంది కదూ. ‘సెయింట్‌ హెలెనా’ అనే దీవిలోని ఈ ఊరు అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఉంది. మిగతా ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ ఐలాండ్‌ అచ్చంగా ప్రకృతి ఒడిలో పుట్టినట్టుగా ఉంటుంది. అందుకే దీన్ని చూసినవారంతా ‘ఇదో కొత్త ప్రపంచం’ అని చెబుతుంటారు. 1502లో పోర్చుగీస్‌ నావికుడు కనిపెట్టిన ఈ దీవికి ఓ రోమన్‌ చక్రవర్తి తల్లి పేరును పెట్టారట. చిన్నపట్టణమంత విస్తీర్ణంలో ఉండే ఈ దీవిలో దాదాపు నాలుగువేలమంది జనాభా ఉంటారు. ఎత్తయిన కొండల నడుమ లోయలో ఉండే ఈ ఊరిలోకి దీవి పైనుంచి చేరాలంటే మాత్రం అంత సులువేం కాదు. పెద్దబావిలోపలికి మెట్లదారిలో వెళ్లినట్టుగా... ఈ ఊరిని చేరడానికి పొడవైన నిచ్చెనలాంటి దారిలో వెళ్లాలి. ఏది ఏమైనా, గజిబిజి జీవితాలను కాస్త పక్కనపెట్టి నాల్రోజులు ప్రశాంతంగా గడపాలనుకునే ప్రకృతిప్రేమికులకు ఇదో చక్కటి పర్యటక ప్రాంతం!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..