ఈ కెఫేలు... ఆటల కోసం!
వీకెండ్ వస్తోంది... ఈ వారం ఎక్కడికెళ్లాలా అని తెగ ఆలోచిస్తున్నాడు వీరేన్. అప్పుడే ఫోన్ చేశాడు సునీల్. వెంటనే రేపటి ప్లానేంటీ అని అడిగేశాడు. ‘అరె... దానికింత ఆలోచనేంట్రా... బోర్డ్ గేమ్ కెఫేకి వెళదామా... కొత్త ఆటలూ నేర్చుకోవచ్చు’ అన్నాడు.
ఈ కెఫేలు... ఆటల కోసం!
వీకెండ్ వస్తోంది... ఈ వారం ఎక్కడికెళ్లాలా అని తెగ ఆలోచిస్తున్నాడు వీరేన్. అప్పుడే ఫోన్ చేశాడు సునీల్. వెంటనే రేపటి ప్లానేంటీ అని అడిగేశాడు. ‘అరె... దానికింత ఆలోచనేంట్రా... బోర్డ్ గేమ్ కెఫేకి వెళదామా... కొత్త ఆటలూ నేర్చుకోవచ్చు’ అన్నాడు. ‘ఓకే డన్’ అంటూ రిలాక్సయిపోయాడు వీరేన్. ఈ కొత్త రకం కెఫే ఏంటో... అక్కడ ఆడే ఆటలేంటో మనమూ ఓ లుక్కేస్తే పోలా..!
ఊరకే కూర్చుని కబుర్లతో కాలక్షేపం చేయకుండా ఆ సమయాన్నీ మెదడుకు పదునుపెడుతూనే ఆటవిడుపునీ కలిగిస్తున్నాయీ బోర్డ్ గేమ్ కెఫేలు. అందుకే మెట్రో నగరాల్లో వెలుస్తోన్న ఈ కెఫేల పట్ల యువతతోపాటు చిన్నా పెద్దా అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన సత్య వీకెండ్ వస్తే చాలు... తన పదేళ్ల కొడుకుని గేమ్ కెఫేకి తీసుకెళుతుందట. సత్య అనేకాదు, బోర్డు గేమ్స్ పట్ల ఇష్టం ఉన్నవాళ్లంతా ముంబై, దిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో కొత్తగా వస్తోన్న ఈ కెఫేల బాట పడుతున్నారు. కిట్టీ పార్టీలకీ బర్త్‌డే వేడుకలకీ, గెట్ టు గెదర్‌లకీ వేదికలుగా మారుతున్నాయివి. గంటకింతనీ రోజుకింతనీ ఛార్జ్ చేసే ఈ కెఫే వ్యాపారంలోకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్నీ వదులుకునీ వస్తున్నారు కొందరు ఔత్సాహికులు. ఇందుకోసం కొత్త రకం పజిల్స్‌నీ గేమ్స్‌నీ దేశవిదేశాలనుంచి తెప్పిస్తున్నారట.
అసలేమిటీ ఆటలు?
ఒకప్పుడు పిల్లలూ పెద్దవాళ్లూ వైకుంఠపాళీ, చైనీస్ చెక్కర్, అష్టాచెమ్మా, పచ్చీస్... వంటి ఆటలు ఆడుకునేవారు. వామనగుంటలు, అచ్చనకాయల్లాంటి ఆటలూ ఉండేవి. ఆ రోజులు పోయి ఇంట్లోకి టీవీ చేతిలోకీ సెల్‌ఫోనూ వచ్చాయి. వాటితోనే కాలాన్ని కరిగిస్తూ ఒత్తిడికి లోనవుతున్నారు. అందుకే డిజిటల్ డిటాక్సిఫికేషన్ పేరుతో వారంలో ఒక్కరోజయినా వాటిని పక్కనపెట్టే పద్ధతిని కొందరు పాటిస్తున్నారు. అలాంటివాళ్లకి ఈ కెఫేలు మంచి కాలక్షేపాన్ని అందిస్తున్నాయి. బోర్డు గేమ్ అనగానే మోనోపలీ, లూడో, స్నేక్ అండ్ ల్యాడర్, చెస్, బిజినెస్, క్యారమ్స్ మాత్రమే చాలామందికి తెలుసు. కానీ ఈ కెఫేలకి వెళితే నోరెళ్లబెట్టాల్సిందే. ఒకటీ రెండూ కాదు... వందలకొద్దీ గేమ్స్ ఉంటున్నాయక్కడ మరి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రావు దంపతులు నడుపుతోన్న ‘గెట్ ఆన్ బోర్డ్’ కెఫేలో అయితే ఏడువందలకు పైగా గేమ్స్ ఉన్నాయి. అమెరికా, ఐరోపాల్లో నివసించి వచ్చిన ఈ దంపతులకి గేమ్స్ ఆడే హాబీ ఉండటంతో ఆయా దేశాల్లో ప్రాచుర్యం పొందిన ఆటల్ని సేకరించి ఈ కెఫేను ప్రారంభించారట. దాంతో ఇది ఇండియాలోనే పెద్ద గేమ్ కెఫేగా పేరొందింది. పరమపదం, స్క్రాబుల్, అబిస్, క్లియోపాత్రా, ఫైవ్ ట్రైబ్స్, కెల్టిస్, కోడ్ నేమ్స్, ప్యుయెర్టొ రికొ, కెప్టెన్ సొనార్, కటాన్, స్మాల్ వరల్డ్, టికెట్ టు రైడ్... ఇలా ఎన్నో రకాల ఆటల్ని ఇక్కడ ఆడుకోవచ్చు. అవార్డుని అందుకున్న ‘టికెట్ టు రైడ్’ అన్న గేమ్‌కి సంబంధించి అయితే 15 వెర్షన్స్ ఉన్నాయి. మొత్తమ్మీద ‘స్లై’ అనే అతి చిన్న గేమ్ నుంచి ‘ద మార్కెట్ ఆఫ్ అల్ట్యూరియన్’ అనే అతి పెద్ద గేమ్ వరకూ ఉన్నాయక్కడ. వీటిల్లో చాలా ఆటల్ని ఆడటం అటుంచి పేర్లు కూడా విననివే ఎక్కువ. కానీ వాటిని నేర్పించేందుకు గేమ్ గురూలూ ఉంటున్నారు. ఆయా ఆటల్ని బేసిక్, మీడియం, హెవీ... ఇలా విభాగాలుగా చేసి మరీ ఆడిస్తున్నారు. ప్రాథమిక అవగాహన లేనివాళ్లకి లాస్‌వేగాస్, డ్రాగన్‌వుడ్, ఫర్ సేల్... వంటి తేలికైన గేమ్స్ ఇస్తారట. హెవీ స్ట్రాటజీ గేమ్స్ ఆడేవాళ్లకి గేమ్ గురూల అవసరం ఉండదు. కొన్ని ఆటలయితే క్లిష్టంగా మెదడుకి మేతలా ఉపయోగపడుతున్నాయి. ఈ బోర్డుగేమ్‌ల వల్ల ఉద్యోగుల్లో టీమ్ బిల్డింగ్, లాజికల్‌గా ఆలోచించడం; పిల్లల్లో సమస్యల్ని పరిష్కరించే నైపుణ్యాలూ వృద్ధి చెందుతాయనీ నిపుణులూ చెబుతున్నారు. కలిసి ఆడుకోవడం వల్ల స్నేహితులూ కుటుంబీకుల మధ్య అనుబంధాలూ బలపడతాయి. పరిచయాలు స్నేహంగానూ మారడంతో యువత వీటిపట్ల ఆకర్షితులవుతున్నారు. అందుకే ఈ కొత్త రకం కెఫేల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ