అర్జున్ కూతురు... ఆపిల్ తొక్కతో ఏం చేస్తోందంటే..!
ఈ చిత్రంలో ఉన్న అమ్మాయి పేరు అంజన... యాక్షన్ కింగ్ అర్జున్ ముద్దుల తనయ. తన చేతికి ఉన్న హ్యాండ్‌బ్యాగు ధర... పాతికవేల రూపాయలు. సినిమా కుటుంబం కదా అంతపెట్టి కొంటారులే అనుకోవచ్చు కానీ... ఇక్కడ విషయం అది కాదు. ఆ బ్యాగుని తయారుచేసింది అంజనానే!
అర్జున్ కూతురు... ఆపిల్ తొక్కతో ఏం చేస్తోందంటే..!
ఈ చిత్రంలో ఉన్న అమ్మాయి పేరు అంజన... యాక్షన్ కింగ్ అర్జున్ ముద్దుల తనయ. తన చేతికి ఉన్న హ్యాండ్‌బ్యాగు ధర... పాతికవేల రూపాయలు. సినిమా కుటుంబం కదా అంతపెట్టి కొంటారులే అనుకోవచ్చు కానీ... ఇక్కడ విషయం అది కాదు. ఆ బ్యాగుని తయారుచేసింది అంజనానే! వాళ్ళ నాన్నలాగా, అక్క ఐశ్వర్యలాగా తనూ సినిమాలవైపు వెళ్ళకుండా ఇలా బ్యాగులు రూపొందిస్తోంది. అదీ... ఆపిల్ తొక్కతో, అనాస ఆకులతో... ఆ విశేషాలివి...
ఐదేళ్ళ చదువు, రెండేళ్ళ ఉద్యోగానుభవం, మరో రెండేళ్ళ నిరంతర పరిశోధన... అంజన రూపొందించిన ఈ ‘సర్జా’ బ్యాగుల వెనక ఇంత శ్రమ ఉంది. మామూలు లెదర్ బ్యాగులు చేయడానికైతే ఇంత కష్టపడక్కర్లేదుకానీ... ఈ అమ్మాయి పర్యావరణానికి ఏ ముప్పూ వాటిల్లని ముడివస్తువులతోనే వాటిని తయారుచేయాలనుకుంది. అందుకోసమే ఆపిల్ తొక్కనీ, అనాస ఆకుల్నీ ఎంచుకుంది. వీటితో బ్యాగుల్ని ఎలా చేస్తుందో తెలుసుకునే ముందు... తన చదువూ, పరిశోధనల గురించి ఇంకాస్త చూడాలి...
అంజన... యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా రెండో కూతురు. తనకి చిన్నప్పటి నుంచీ చిత్రలేఖనమన్నా ఫొటోగ్రఫీ అన్నా ఇష్టమట. అందుకని, ఇంటర్ చదివాక సింగపూర్‌లోని ప్రఖ్యాత లసాల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో ఫొటోగ్రఫీ కోర్సు కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ తనకి అక్కడ ఫొటోగ్రఫీకి బదులు ఫ్యాషన్ డిజైనింగ్‌లో సీటొచ్చిందట. ‘ఫ్యాషన్ డిజైనింగ్ కూడా కళకు సంబంధించిందే కాబట్టి వెళ్ళి చేరిపోయాను. వెళ్ళాకే- సినిమాల్లాగే ఫ్యాషన్ డిజైనింగ్ కూడా అటు కళా, ఇటు వాణిజ్యం రెండూ సమపాళ్ళలో ఉండాల్సిన రంగమని అర్థమైంది. కోర్సు పూర్తయ్యాక అమెరికాలోని పార్సన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూయార్క్‌లో ‘ఫ్యాషన్ మార్కెటింగ్’పైన మరో కోర్సు చేశాను. అదయ్యాక ప్రఖ్యాత ‘ఎలీ తహరి’ సంస్థలోనూ, అమెరికన్ ఫ్యాషన్ ప్రపంచంలో బాగా పేరున్న ‘ప్రొయెంజా స్కూలర్’ సంస్థలోనూ రెండేళ్లపాటు ఉద్యోగం చేశాను. అప్పుడే నాకు ఓ ముఖ్యమైన విషయం తెలిసింది... అదేంటంటే పర్యావరణ కాలుష్యానికి కారణమైన మూడో అతిపెద్ద రంగం ఫ్యాషన్ ప్రపంచమేనని! కనీసం నా వంతుగానైనా ఆ పరిస్థితిని మార్చాలనుకున్నాను. పర్యావరణహిత ఫ్యాషన్ వస్తువులపైన దృష్టిపెట్టాలనుకున్నాను...’ అంటుంది అంజన. ఆ ఆలోచనతోనే పరిశోధనలు మొదలుపెట్టి... అవేవో భారతదేశంలోనే చేద్దామని 2019లో ఇక్కడికి వచ్చేసింది.
అవే ఎందుకంటే...
ఇక్కడికొచ్చి ఏడాదిపాటు జనపనారతో చేసే వస్త్రాలూ, యాక్సెసరీలూ తయారుచేసే కొన్ని ‘వీగన్’ కంపెనీల్లో శిక్షణ తీసుకుంది. ‘నాకు ఈ వీగన్‌లోనూ సమస్య ఉందనిపించింది. జనుములాంటి వస్తువులతో తయారుచేసిన యాక్సెసరీలు, లెదర్‌వాటిల్లా కనిపించడానికి భారీ ఎత్తున ప్రాసెసింగ్ చేయాల్సి వచ్చేది. అందుకోసం పెద్ద ఎత్తున నీటిని వృథా చేస్తున్నారు. అది కూడా పర్యావరణానికి ముప్పే కదా అనుకున్నాను. అప్పుడే నా దృష్టి పళ్ళ తొక్కతో దుస్తులు తయారుచేసే టెక్నాలజీపైన పడింది. కానీ దుస్తులకి అవసరమైన ‘వస్త్రం’ పెద్ద మొత్తంలో కావాలి. అంత పెద్ద ఎత్తున పళ్ళ వ్యర్థాలు దొరకడం సాధ్యం కాదు కాబట్టి... చిన్న వస్తువులకి వాటిని పరిమితం చేయాలనుకున్నాను. అందుకే బ్యాగుల్ని ఎంచుకున్నాను. ముందు ఆపిల్ తొక్కతో...
లెదర్‌కి ఏమాత్రం తీసిపోని మన్నికైన మెత్తటి మెటీరియల్‌ని తయారుచేశాను. మనదేశంలోని జ్యూస్ తయారీ పరిశ్రమ ఆపిల్ తొక్కని భారీ ఎత్తున చెత్తలో పడేస్తుంటుంది. నేను వాటినే నా పరిశ్రమకి ఉపయోగించుకుంటున్నాను. అనాస పంట చేతికొచ్చాక చెట్టు ఆకులన్నింటినీ కాల్చేస్తుంటారు. నేను వాటిని తీసుకుని అందులో నుంచి నార తీసి బ్యాగుల తయారీ మెటీరియల్‌గా మార్చాను’ అంటున్న అంజనా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కుసుమరాజయ్య తయారుచేసిన అహింసా పట్టునే బ్యాగు లోపల వస్త్రంగా వాడుతోంది. జిప్‌లూ, హ్యాండిల్స్ లాంటివాటికి సులభంగా రీసైక్లింగ్ చేయగల అల్యూమినియం, ప్రత్యేక జింక్‌లాంటివాటిని ఉపయోగిస్తోంది.
ఈ పరిశోధనలూ, ప్రయోగాలన్నీ ఓ కొలిక్కి వచ్చాక తన ఇంటిపేరుతోనే ‘సర్జా’ అన్న సంస్థని స్థాపించింది. ఆ సంస్థ ద్వారా ఆరు రకాల బ్యాగుల్ని ఈ మధ్యే విడుదలచేసింది! పాతిక నుంచి నలభైఐదు వేల వరకూ ఉన్నాయి వాటి ధరలు. ‘హైఫైగా ఉంటూనే పర్యావరణానికి కాస్తయినా మేలు చేయాలనుకునేవారికి మా ఉత్పత్తులు మంచి ఎంపిక’ అంటోంది అంజన.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Amaravati: కాగ్ నివేదికలు వైకాపా అసమర్థ పాలనకు నిదర్శనం: ఎమ్మెల్సీ అశోక్‌బాబు
-
Kharge: మహిళా రిజర్వేషన్ల బిల్లు.. అది భాజపా గారడీనే: ఖర్గే
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?
-
Crime news మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడి యత్నం!
-
Janasena: తెదేపాతో కలిసి సమస్యలపై పోరాడాలి: నాదెండ్ల మనోహర్
-
Social Look: నజ్రియా వెకేషన్.. నయన్ సెలబ్రేషన్స్..!