రంగులు లేకుండానే రంగుల బొమ్మేద్దాం!

చిన్నపిల్లల్ని కాసేపు ఆడించాలన్నా, పేపర్‌ మీద కొత్త విషయాలు నేర్పించాలన్నా అది కచ్చితంగా వెరైటీగా ఉంటేనే ఎక్కువ ఇష్టపడతారు.

Published : 03 Dec 2022 23:48 IST

రంగులు లేకుండానే రంగుల బొమ్మేద్దాం!

చిన్నపిల్లల్ని కాసేపు ఆడించాలన్నా, పేపర్‌ మీద కొత్త విషయాలు నేర్పించాలన్నా అది కచ్చితంగా వెరైటీగా ఉంటేనే ఎక్కువ ఇష్టపడతారు. అందుకే చిన్నారుల్ని ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు మార్కెట్లోకి సరికొత్త మార్పులతో ఎన్నో వస్తువులు క్యూ కడుతుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఈ ‘రెయిన్‌బో ఆర్ట్‌ స్క్రాచ్‌ పేపర్‌ షీట్స్‌’. అప్పుడప్పుడే పేపరూ, పెన్సిలూ పట్టుకున్న బుజ్జాయిలకు ఇవి మంచి బహుమతి. చూడ్డానికి మామూలు బ్లాక్‌ పేపర్లలానే కనిపించే వీటిపైన- పెన్నులాంటి దాంతో ఏదైనా బొమ్మను గీయడమో, అక్షరాలని రాయడమో చేశామంటే... అవన్నీ కూడా హరివిల్లు రంగుల్లో మెరిసిపోతూ కనిపిస్తాయి. ఎలాంటి రంగులు వేయకుండానే ఊరికే గీస్తుంటేనే రంగురంగులు కనిపించడం అనేది పిల్లలకు భలేగా నచ్చేస్తుంది. ఇంతకీ అలా రంగుల బొమ్మ ప్రత్యక్షమవ్వడానికి కారణం... కాగితం మీదున్న నలుపు రంగు కింద హరివిల్లు రంగులుంటాయి. పైనున్న నలుపు రంగుని పెన్నుతో స్క్రాచ్‌ చేయడం వల్ల కిందున్న రంగుల్లో బొమ్మ ఆకారం చక్కగా కనిపిస్తుందన్నమాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..