మకర సంక్రాంతికి.. మాంచి కేక్‌!

‘అబ్బాయి పుట్టినరోజు సంక్రాంతి ముందురోజే కాబట్టి పండుగ గురించి చెబుతూనే బాబును సర్‌ప్రైజ్‌ చేయాలి’ - అనుకుందో అమ్మ. ఆ వెంటనే మామూలు బర్త్‌డే కేక్‌ కాకుండా సంక్రాంతి పండుగ థీమ్‌ కేక్‌ తెప్పించింది.

Published : 08 Jan 2022 23:44 IST

మకర సంక్రాంతికి.. మాంచి కేక్‌!

‘అబ్బాయి పుట్టినరోజు సంక్రాంతి ముందురోజే కాబట్టి పండుగ గురించి చెబుతూనే బాబును సర్‌ప్రైజ్‌ చేయాలి’ - అనుకుందో అమ్మ. ఆ వెంటనే మామూలు బర్త్‌డే కేక్‌ కాకుండా సంక్రాంతి పండుగ థీమ్‌ కేక్‌ తెప్పించింది. ప్రతి వేడుకనూ కేక్‌ కటింగ్‌తో జరుపుకుంటాం అలాంటిది భోగిమంటలకు ఇంటిల్లిపాదీ ఒకే దగ్గర చేరినప్పుడు ఆ సంతోషాన్ని సరదాగా కేక్‌తో పంచుకోవాలి’ - ముచ్చటపడిందో కుటుంబం. భోగిమంటల కేక్‌తో ఆ కోరిక తీర్చుకుంది. ఏంటీ ఇదంతా అంటే... ఆనందకరమైన అన్ని సందర్భాలకు తగ్గట్టు కేకును ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకోవడం తెలిసిందే కదా. అందులో భాగంగానే ఇప్పుడు సంక్రాంతి పండుగ థీమ్‌ కేకుల్నీ రూపొందిస్తున్నారు. చెరుకుగడలు, పొంగలి కుండలు... భోగి మంటలు, కలశం, పొలంలో రైతు, గాలిపటం... ఇలా సంక్రాంతి పండుగలోని రకరకాల అంశాల్నీ కేకుల్లో చూపిస్తూ, కేకు ప్రియుల మనసులు దోచుకుంటున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..