సిల్లీ పాయింట్
ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటున్నా... రష్యా, ఈజిప్టులోని క్రైస్తవులు మాత్రం జనవరి ఏడున ఈ వేడుకను చేస్తారు!
* అమెరికాలో అత్యధిక సంఖ్యాకులు ఇంగ్లిషే మాట్లాడుతున్నా... అది అక్కడ అధికార భాషకాదు. నిజానికి, అగ్రరాజ్యంలో అధికారభాషంటూ ఏదీ లేదు.
* సింగపూర్‌లో పబ్లిక్ టాయిలెట్స్ ఉపయోగించుకుని ఫ్లష్ చేయకపోతే... ఏడువేల రూపాయలదాకా ఫైన్ వేస్తారు!
* పిల్లులు మామూలు నీళ్లలాగే సముద్రపు నీళ్లనీ ఎంచక్కా తాగేయ గలవు. ఆ లవణాలనీ వడకట్టగల సామర్థ్యం వాటి కిడ్నీలకి ఉంటుందట...!
* చైనీయులు ఏ శుభకార్యక్రమమైనా సరే గడియారాలనీ పూలనీ కానుకలుగా ఇవ్వరు! వాటిని వాళ్లు విషాదానికి సంకేతాలుగానే చూస్తారు.
* నార్వేలో మే నెలలో ఉదయించే సూర్యుడు... మళ్లీ జులై ఆఖర్లోకానీ అస్తమించడు. మొత్తం 76 రోజులూ వాళ్లకి పగలేనన్నమాట!!
* ఫ్లెమింగో తన ఆహారాన్ని మిగతా పక్షుల్లా ముక్కున నేరుగా పట్టి తినదు. తినడానికి ముందు తన ముక్కుని నేలపైనో నీటిలోనో తలకిందులుగా వాల్చి... ఆ తర్వాతే గుటుక్కుమనిపిస్తుంది!
* బూట్లూ, సాక్సులూ శుభ్రంగా ఉంచుకోకపోతే పాదాలు దుర్వాసన వేస్తుంటాయి. మలేరియాకి కారణమైన దోమ ఇలాంటి పాదాలనే ఎక్కువగా కుడుతుందని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది!
* అమెరికా, ఐరోపా సముద్రతీరాల్లో కనిపించే పఫిన్ పక్షులు నీళ్లలోనూ ఎగరగలవు!
* స్పైడర్ మ్యాన్ పాత్ర పుట్టి ఈ ఏడాదితో 60 ఏళ్లవుతున్నాయి. అనాథ, పేదవాడు, టీనేజీలోనే ఉన్న కుర్రవాడు... ఇలాంటి పాత్రని ఓ సూపర్‌హీరోగా మలచిన తొలి ప్రపంచ కామిక్ బుక్ ఇదేనంటారు!
ఫేస్బుక్ సంస్థకి మెటా అని కొత్తపేరు పెట్టారు తెలుసుకదా. మార్క్ జుకర్‌బెర్గ్ మాతృభాష హిబ్రూలో దానికి ‘మృత్యుదేవత’ అని అర్థమట!
శుభలేఖ ల్లేని పెళ్ళిళ్ళని ఇప్పుడు ఊహించలేం కదా! నిజానికి, ఈ అలవాటు ఆంగ్లేయుల పాలనతో 19వ శతాబ్దం నుంచి మనకి వచ్చింది. అప్పటిదాకా లేఖలేవీ లేకుండా ఊరికే మనుషులతో కబురంపే వాళ్లం అంతే.
పున్నమినాటి నిండు చందమామ కురిపించే వెన్నెల ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! అవకాశం రావాలే కానీ... చందమామపై నుంచి భూమిని చూడటం అంతకన్నా అద్భుతంగా ఉంటుందట. అవును... భూమిపైనున్న మనకి చందమామ పంచే వెలుగు కన్నా... చందమామ పైకి భూమి ప్రసరించే వెలుగు 48 రెట్లు ఎక్కువ కాంతిమంతంగా ఉంటుందట.
‘రేపు ఓ ట్రిప్‌కి వెళుతున్నాం. అక్కడ సిగ్నల్ లేకపోతేనో, మొబైల్ పాడైపోతేనో ఏం చేయాలి!’ - అని ఎప్పుడైనా అకారణంగా భయపడ్డారా. దీన్నే నోమో ఫోబియా అంటారట... అంటే ‘నో మొబైల్ ఫోబియా’ అని.
పర్యటనలంటే ఇష్టపడే కొలంబియన్లు డిసెంబర్ 31న ఖాళీ సూట్‌కేసులు పట్టుకుని ఇంటి దగ్గర అటూఇటూ సరదాగా తిరుగుతారు. ఏడాదంతా బోలెడన్ని పర్యటనలు చేస్తారనే నమ్మకమే ఇలా చేయిస్తుంది.
బ్రిటిష్ పోలీసులు నిందితుల మాటల్ని రికార్డు చేయడం కోసం... ఇప్పటికీ టేప్ రికార్డర్లనే వాడతారు! కేవలం ఈ పోలీసుల కోసమే ఇంగ్లండులో లక్షల సంఖ్యలో టేప్రికార్డర్లని తయారు చేస్తున్నారు!
మనభారత రాజ్యాంగంలోని India, that is Bharat, shall be a union of states... అన్న తొలి వాక్యంలో తప్ప భారత్ అన్న పదం ఇంకెక్కడా కనిపించదు. మిగతా అన్నిచోట్లా ఇండియా అనే ఉంటుంది.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్