సిల్లీ పాయింట్‌

రోప్‌వేల వాడకం మనదేశంలో కొత్త కాకపోయినా... వాటిని ఇప్పటిదాకా పర్యటక కొన్ని ప్రదేశాల్లోనే ఉపయోగిస్తున్నారు. దాన్ని మొట్టమొదటిసారి ప్రజారవాణా కోసమని త్వరలో వారణాసిలో ప్రారంభించనున్నారు. బొలివియా, మెక్సికో తర్వాత అలా ఉపయోగిస్తున్న దేశం మనదే కానుంది.

Updated : 09 Jan 2022 14:26 IST

సిల్లీ పాయింట్‌

 రోప్‌వేల వాడకం మనదేశంలో కొత్త కాకపోయినా... వాటిని ఇప్పటిదాకా పర్యటక కొన్ని ప్రదేశాల్లోనే ఉపయోగిస్తున్నారు. దాన్ని మొట్టమొదటిసారి ప్రజారవాణా కోసమని త్వరలో వారణాసిలో ప్రారంభించనున్నారు. బొలివియా, మెక్సికో తర్వాత అలా ఉపయోగిస్తున్న దేశం మనదే కానుంది.

* ప్రపంచంలో అత్యధికంగా రెస్టరంట్లున్న నగరం న్యూయార్క్‌! వెళ్లిన రెస్టరెంట్‌కు మళ్లీ వెళ్లకుండా 54 ఏళ్ల పాటు రోజుకో కొత్త హోటల్లో తినొచ్చంటే... చూస్కోండి!

* గూగుల్‌ సంస్థ... ఉద్యోగుల ఎంపికలో డిగ్రీలకన్నా సామర్థ్యానికే పెద్దపీట వేస్తుందట. ఎంతగా అంటే... ఆ సంస్థ ఉద్యోగుల్లో 14 శాతం మంది కాలేజీ స్థాయి దాటని వారే మరి!

* రెండో ప్రపంచ యుద్ధంలో 76,875 విమానాలు ధ్వంసమయ్యాయి. అయితే ఏమిటీ అంటారేమో... ఇప్పటికీ ప్రపంచంలో ఉన్న విమానాల సంఖ్య పాతికవేలని మించదు మరి!

* 2019లో నాసా ఓ అధ్యయనం కోసం 24 మంది(12 మంది అబ్బాయిలు, 12 మంది అమ్మాయిలు) వలంటీర్లను ఎంపిక చేసింది. వారు చేయాల్సిన పనేంటంటే.. రెండు నెలలపాటు వాళ్లు తమ బెడ్‌పైనే పడుకొని ఉండటం. నాటి విజేతలకు దాదాపు రూ.12 లక్షల బహుమతి కూడా ఇచ్చారు.

* చార్లీచాప్లిన్‌ ఆస్కార్‌ అవార్డు అందుకున్న సమయంలో 12 నిమిషాలపాటు స్టాండిగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. ఇప్పటిదాకా అంత సుదీర్ఘ చప్పట్లు మరే కళాకారుడికీ దక్కలేదు మరి.

* కోకాకోలా తయారీ ఫార్ములా తెలిసిన వాళ్లలో ప్రస్తుతం ఇద్దరే బతికున్నారు. అందుకే, ఆ ఇద్దరూ ఒకే విమానంలో ప్రయాణించడానికి ఆ సంస్థ అనుమతించదు.


రాత్రి వేసుకునే పైజమాలు మొదటి ప్రపంచ యుద్ధం సమయంలోనే వచ్చాయి. అంతకు ముందు నైట్‌గౌన్లనే వేసుకునేవారు. అయితే, యుద్ధం సమయంలో ఆకస్మిక విమానదాడులు జరిగినప్పుడు ప్రజలు గభాల్న బయటకు పరుగు తీసేందుకు వీలుగా పైజమాలను వేసుకోవడం మొదలుపెట్టారట.


గంటన్నర పాటు హారర్‌ సినిమా చూస్తే 113 కెలోరీలు ఖర్చవుతాయని చెబుతోంది ఓ అధ్యయనం. ఇది అరగంట నడకతో సమానమట!


1930ల దాకా మీసాలకు అంటకుండా టీ తాగేందుకు ప్రత్యేకంగా కప్పులు ఉండేవి.


ప్రపంచంలో మొట్ట మొదటి ఎస్సెమ్మెస్‌... ‘మెర్రీ క్రిస్మస్‌’. 30 ఏళ్ల క్రితం వొడాఫోన్‌ ద్వారా పంపిన ఈ సందేశాన్ని ఇటీవల వేలానికి కూడా పెట్టారు!


‘మాకు అబ్బాయి పుట్టాడొహో’ అని ప్రపంచానికి చాటడానికి 2019లో ఓ జంట అతి ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫాని ఎంచుకుంది. ఇందుకోసం వాళ్ళు రూ.73 లక్షలు ఖర్చు చేశారట!


1894లో జర్మనీలోని ఒక నదిలో మునిగిపోతున్న పిల్లాణ్ని ఓ మతప్రవక్త కాపాడాడు. ఆ బాలుడు ఎవరో కాదు.. ప్రపంచాన్ని గడగడలాడించిన అడాల్ఫ్‌ హిట్లర్‌!


మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లోని ‘మదర్స్‌ మార్కెట్‌’ 500 ఏళ్ల పాతది. మహిళలు మాత్రమే నిర్వహించే ఈ మార్కెట్‌ ఆసియాలోనే అతిపెద్దది. ఈ మార్కెట్‌లో ఎవరైనా దుకాణం తెరవాలంటే కచ్చితంగా పెళ్లై ఉండాలనే నిబంధన ఉంది!


ఫస్ట్‌... ఫస్ట్‌..!

భారతీయ సినిమాల్లో బాలీవుడ్‌, టాలీవుడ్‌ అని లేకుండా ముద్దు సీన్లు ఇప్పుడు సర్వసాధారణం. అయితే తొలి ముద్దు సీను మూకీ సినిమాలనాటికే ఉందట. 1921నాటి బెంగాలీ సినిమా బిలత్‌ ఫేరత్‌ లో ధీరేంద్రనాథ్‌ గంగూలీ, మన్మథ పాల్‌ల మధ్య ముద్దు సీన్లు ఉన్నాయి. ఆ తరవాతా ఒకటిరెండు సినిమాల్లో కనిపించినా 1933లో వచ్చిన ‘కర్మ’ సినిమాలో నిజ జీవితంలోనూ భార్యాభర్తలైన దేవికారాణి, హిమాన్షురాయ్‌ల ముద్దు సీను 4 నిమిషాలపాటు సాగిందట. ఇప్పటివరకూ ఇదే అత్యంత సుదీర్ఘమైన ముద్దుసీను మరి! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..