సిల్లీపాయింట్‌

కజకిస్థాన్‌, జపాన్‌ దేశాల్లో గుర్రం మాంసాన్ని తింటారు. మిగతా అన్ని మాంసాలకన్నా... ఇందులో హానిచేసే సూక్ష్మక్రిములు తక్కువగా ఉంటాయన్నది వాళ్ల నమ్మకం.

Updated : 12 Dec 2022 22:48 IST

సిల్లీపాయింట్‌

కజకిస్థాన్‌, జపాన్‌ దేశాల్లో గుర్రం మాంసాన్ని తింటారు. మిగతా అన్ని మాంసాలకన్నా... ఇందులో హానిచేసే సూక్ష్మక్రిములు తక్కువగా ఉంటాయన్నది వాళ్ల నమ్మకం.

* స్వెట్‌ బీస్‌, మేసన్‌ బీస్‌, డిగ్గర్‌ బీస్‌, లీఫ్‌ కట్టర్స్‌... ఈ నాలుగూ తేనెటీగల్లోని రకాలు. మామూలు వాటిల్లా ఎత్తైన ప్రదేశాల్లో కాకుండా... నేలపైనా గూడుకట్టుకోవడం వీటి ప్రత్యేకత. అంతేకాదు, అసలు వీటికి మనుషుల్ని కుట్టడమే రాదు!

* లిథువేనియా... యూరప్‌లోని చిన్నదేశాల్లో ఒకటే కానీ ఫ్రీ ఇంటర్నెట్‌ అందించడంలో దానిది దొడ్డ మనసు! ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా 15 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఫ్రీ వైఫై పొందవచ్చు అక్కడ. మనదేశంలోని ఫ్రీవైఫై స్పాట్‌లలో ఆ స్పీడు 1 ఎంబీపీఎస్‌కి మించదు మరి!

* 112... మనదేశంలో ఈ మధ్యే అమల్లోకి వచ్చిన అత్యవసర నంబర్‌. మనదగ్గరే కాదు... యూరప్‌ యూనియన్‌ దేశాలూ, నార్వే, రష్యాలోనూ ఇదే ఎమర్జెన్సీ నంబర్‌ అట.

* ప్రపంచంలోని ప్రతి ఐదుగురిలో ఒకరికి... చుండ్రు సమస్య ఉంటుంది. ఆ ఐదుగురిలోనూ ముగ్గురు మగవాళ్ళయి ఉంటారు!


అతనికి రెండేళ్లున్నప్పుడు మూడు అంతస్త్తుల పై నుంచి పడి... చావుతప్పి బయటపడ్డాడు. మూడేళ్ళప్పుడు పాలనుకుని యాసిడ్‌ తాగి ఎలాగో బతికి బట్టకట్టాడు. ఆ తర్వాత ఓ మందుగుండు కుప్పలో పడి ఒళ్ళంతా కాల్చుకున్నాడు. ఓసారి తలపైన బండ పడటమే కాదు... తానూ నదిలో పడి ఇక చచ్చిపోయాడనుకున్న సమయంలో కళ్ళు తెరిచాడు. చివరికి నోటి క్యాన్సర్‌నీ జయించాడు. ఇన్నిసార్లు మృత్యుంజయుడైన అతని పేరు శాక్స్‌. శాక్సాఫోన్‌ సంగీత పరికరం సృష్టికర్త అతనే!


*దక్షిణాఫ్రికాలోని ఒక రకం గొల్లభామలకి... చెవులు వాటి పొట్టలో ఉంటాయి. అదీ ఒకట్రెండు కాదు... ఆరుంటాయి. అందుకే, రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాకూడా అవి పరస్పరం సంభాషించుకోగలవు కూడా!


*‘సోంపు’ నిజానికి... ఫెనెల్‌ అనే క్యారట్‌ జాతి మొక్క నుంచి వస్తుంది. ఉల్లిపాయలాంటి ఆ మొక్కకాండాన్ని ఇజ్రాయెల్‌, ఇరాన్‌ దేశాల వంటల్లో వాడతారు.


* లద్దాక్‌ ప్రజలు హిమనదాలని (గ్లేసియర్స్‌) పూజిస్తారు... వాటిని ఆడ, మగ అని విభజిస్తారు. నల్లగా దుమ్ముపట్టినవి మగవైతే, స్వచ్ఛంగా తళతళలాడేవి ఆడవి. ఈ రెండింటి కలయికతో ఏర్పడే కొత్త హిమనదాలని వాటి పిల్లలుగానే ఆరాధిస్తారు.


* మొఘల్‌ రాజులెప్పుడూ తమ వంశాన్ని ఆ పేరుతో పిలుచుకోలేదు. 19వ శతాబ్దంm నాటి ఆంగ్లేయ చరిత్రకారులే - వాళ్ళు మంగోలుల వంశంవాళ్ళన్న నమ్మకంతో ఆ పేరు తగిలించారు.


పెంటెకాస్ట్‌... ఆస్ట్రేలియా నుంచి 3,723 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్నదీవి. ఓ పెద్ద అగ్నిపర్వతంతో కూడుకున్న ఈ దీవి వాసులే... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమసైపోయిన బంగీజంప్‌ని కనిపెట్టింది.


చెప్పుల షాపుల్లో సైజ్‌ చూడ్డానికి ఉపయోగించే పరికరానికో పేరుంది. దాన్ని బ్రెనాక్‌ డివైజ్‌ అంటారు. బ్రెనాక్‌ అనే వ్యక్తి కనిపెట్టాడు కాబట్టి ఆ పేరు.


మనదేశంలో దక్షిణాదివారే ఎక్కువగా మీసాలు పెంచుతుంటారు. కేవలం ఆ కారణంగానే... అత్యధికంగా మీసాలున్నవాళ్ళ దేశాల్లో భారత్‌ నంబర్‌వన్‌గా నిలుస్తోంది. మెక్సికో, పాకిస్తాన్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి!


రాత్రివేళల్లో... హై-వే రోడ్ల అంచునా, డివైడర్ల దగ్గరా మెరిసే చిన్న బుడిపెల్లాంటి రేడియం పరికరాల్ని చూసుంటారు కదా! దాన్ని ‘క్యాట్‌ ఐ’ అని అంటారు.


95 శాతం కూలింగ్‌ గ్లాసెస్‌ ఆడామగా ఇద్దరూ వాడేలా (యూనిసెక్స్‌) ఉంటాయి.


అమెరికాలోని బస్సుల్లో కండక్టర్‌ ఉండరు, డ్రైవర్‌ మాత్రమే ఉంటారు. ఆ డ్రైవర్‌లలోనూ 50 శాతం మహిళలే ఉంటారు!


అడ్డం రాను

పెళ్లి చూపులయ్యాయి. ఒకరికొకరు నచ్చారు. భవిష్యత్తు గురించీ ఇష్టాయిష్టాల గురించీ మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు. ‘నాకు ఇల్లంతా చాలా శుభ్రంగా ఉండాలి సుమా...’ అన్నాడు అబ్బాయి.

దానిదేముంది. ఎప్పటికప్పుడు మీరు శుభ్రం చేసుకుంటానంటే నేను అడ్డు రాను’ సిన్సియర్‌గా చెప్పింది అమ్మాయి.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు