సిల్లీ పాయింట్‌

చక్కగా మాట్లాడతాయని... భారత రామచిలుకల్ని బంగారం ఇచ్చిమరీ కొనేవాళ్ళట ప్రాచీన గ్రీకులు.

Published : 06 Jul 2024 23:55 IST

క్కగా మాట్లాడతాయని... భారత రామచిలుకల్ని బంగారం ఇచ్చిమరీ కొనేవాళ్ళట ప్రాచీన గ్రీకులు. నేటి గ్రీస్‌లో ఉన్న చిలకలన్నీ వాటి సంతతివేనట.

 • అమెరికాలోని అన్ని పబ్లిక్‌ టాయిలెట్‌లూ... ఫ్రీయే. ఎక్కడా డబ్బులు తీసుకోరు.
 • ఓట్లని లెక్కించడం ప్రారంభించాక... తుది ఫలితాలని ప్రకటించడానికి కనీసం వారం రోజులు పడుతుంది స్వీడన్‌లో. వాళ్ళింకా బ్యాలెట్‌ పేపర్లే ఉపయోగించడం ఇందుకో కారణం.
 • మెక్సికోలో జైలు నుంచి తప్పించుకోవడాన్ని నేరంగా పరిగణించరు.
 • క్యారమ్‌ బోర్డులోని నలుపు తెలుపు కాయిన్‌లని ‘మ్యాన్‌’ అని పిలుస్తారు విదేశాల్లో. రెడ్‌ కాయిన్‌ని ‘క్వీన్‌’ అంటారు.
 • చైనా 1950ల్లోనే ‘అరేంజ్డ్‌ మ్యారేజ్‌’లని నిషేధించింది. అయితేనేం... ఇప్పటికీ అక్కడి గ్రామీణ ప్రాంతాల్లో ఆ విధానం ఉంది. ప్రపంచంలో ఇండియా తర్వాత పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళు ఎక్కువగా జరిగేది అక్కడే.
 • ఉల్లిపాయ ఆకారాన్ని అనాది కాలం నుంచీ ఐరోపా దేశస్థులు బల్బ్‌ అనే అంటుండేవారు. అదే ఆకారంలో ఉన్నందునే ఎలక్ట్రికల్‌ లైటునీ బల్బ్‌ అని పిలవడం మొదలుపెట్టారు!
 • చిన్నప్పుడు పేపర్‌తో విమానం చేసి ఆడుకుని ఉంటాం కదా... అమెరికాలో ఆ పేపర్‌ విమానాలకంటూ ప్రత్యేకంగా ఓ రోజు ఉంది. మే 26ని ‘పేపర్‌ ఏరోప్లేన్‌ డే’గా జరుపుకుంటారక్కడ.
 • ఇతర దేశాల మాదిరిగా కాకుండా చైనాలో సూప్‌ని భోజనం మొత్తం పూర్తయ్యాక తాగుతారు. ఇది జీర్ణశక్తిని పెంచుతుందనేది వారి భావన.
 • సంస్కృతాన్ని అధికారిక భాషగా ప్రకటించిన ఏకైక రాష్ట్రం... ఉత్తరాఖండ్‌.
 • ఫిలిప్పైన్స్‌ ప్రజలు రోజూ సుమారు 11 గంటలపాటు మొబైల్‌ చూస్తారట... ఈ విషయంలో ప్రపంచంలోనే వాళ్ళు టాప్‌.

ఫ్లేవర్‌ ఏదైనా సరే... స్త్రీల కోసం తయారుచేసే ప్రతి పెర్ఫ్యూమ్‌లోనూ 70 శాతం గులాబీ పరిమళం ఉంటుందట.

 • చైనాలో స్లీపర్‌ కోచ్‌ బస్సులపైన నిషేధం ఉంది. 2011 వరకూ అవి ఉండేవి కానీ... వాటివల్ల ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని రద్దు చేసేశారు.
 • ఆండ్రాయిడ్‌ అంటే అర్థం మగరోబో అని. ఆడరోబోని ‘గైనాయిడ్‌’ అంటారు. అన్నట్టు, ఈ పేరుతోనూ పలు సాఫ్ట్‌వేర్‌లు మార్కెట్లో ఉన్నాయి.

ర్క్‌ జాతి తిమింగలాలు నిజానికి... తిమింగలాలే కావు, ఓ పెద్ద సైజు డాల్ఫిన్‌లు. అందుకే అవి మిగతా తిమింగల జాతుల్లా మనుషులపైన దాడి చేయవు.

కేరళకి కావాల్సిన బియ్యం పప్పూ ఉప్పులన్నీ పక్క రాష్ట్రాల నుంచి రావాల్సిందే! అక్కడి రైతులు 80 శాతం వాణిజ్య పంటలే వేస్తారు మరి.

మెరికాలో బడిపిల్లలెవరూ పాఠ్య పుస్తకాలు కొనరు... స్కూల్‌లోనే ఇస్తారు. కాకపోతే, ఆ ఏడాది పూర్తయ్యాక వాటిని తిరిగి ఇచ్చేయాలి.

ఫోన్‌ని తొలిసారి రూపొందించాక- దానికి సంబంధించిన పేటెంట్‌ తీసుకునేటప్పుడు, అదో సరికొత్త ఫోన్‌ అనో ఎక్కడాలేని టెక్నాలజీ అనో తీసుకోలేదు. కేవలం దాని ‘అందమైన’ డిజైన్‌ కోసమే పేటెంట్‌ హక్కులు తీసుకున్నారు.

నుషులకి వినిపించని శబ్దాలని ‘ఇన్‌ఫ్రా సౌండ్స్‌’ అంటారు. ఏనుగులు ఆ శబ్దంతోనే తమలో తాము సంభాషిస్తాయట.

 • ముందు వైపు విలాసవంతమైన కారులానే ఉంటుంది... కానీ వెనక చిన్నసైజు సరకు లారీలా ఖాళీస్థలమూ కనిపిస్తుంది. ‘పికప్‌ కార్‌’ అని పిలిచే ఈ తరహా వాహనాలు థాయ్‌లాండ్‌లో చాలా ఫేమస్‌. అక్కడ అమ్ముడుపోయే వాహనాల్లో సగానికి సగం ఇవే ఉంటాయంటే చూసుకోండి.
 • నెదర్లాండ్స్‌లో పిల్లలు నాలుగో ఏడు బర్త్‌డే చేసుకున్న తర్వాతి రోజే స్కూల్‌లో చేరతారు... అది ఏడాదిలో ఎప్పుడైనా సరే.

లిఫ్ట్‌లని ఉపయోగించుకున్న తొలి ప్రసిద్ధ నిర్మాణం... ఈఫిల్‌ టవర్‌. 1889లో అందులో ఐదు లిఫ్ట్‌లని ఏర్పాటుచేస్తే వాటిలో రెండు ఇప్పటికీ ఉపయోగంలో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..