Published : 03 Jul 2022 01:19 IST

సిల్లీ పాయింట్‌

న శరీరంలో షుగర్‌ బాగా పెరిగినా, తగ్గినా చెమట వాసన మారుతుంది. ఆ తేడాని కుక్కలు పసిగట్టేస్తాయి. అందుకే అమెరికాలో, ఒంటరిగా ఉన్న వృద్ధుల్లో అలాంటి తీవ్రమైన పరిస్థితి తలెత్తకముందే పసిగట్టి హెచ్చరించడానికని అక్కడి పెంపుడు కుక్కలకి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు!

* అమెరికాలో థియేటర్లు మొదలైన కొత్తల్లో... సాయంత్రం, రాత్రీ మాత్రమే సినిమా షోలు ఉండేవి. అందువల్లే, సాయంత్రం వేళ ఆటని ఫస్ట్‌ షో అని, రాత్రి ప్రదర్శనని సెకండ్‌ షో అనడం మొదలైంది. ప్రస్తుతం మార్నింగ్‌ షో, మ్యాట్నీ షోలు వచ్చినా సరే... అలా పిలిచే పద్ధతి మాత్రం పోలేదు.

* చెన్నైలో కాకులెక్కువ. 1950ల్లో అక్కడ ఔట్‌డోర్‌ షూటింగ్‌లు తీసేటప్పుడు అక్కడికొచ్చి గోల చేసే కాకుల్ని తరమడానికని ఉత్తుత్తి తుపాకీతో శబ్దం సృష్టించే షూటర్లని నియమించేవారు. సినిమా టైటిల్స్‌లో ‘క్రో షూటర్‌’ అంటూ వాళ్ల పేర్లూ వేసేవారు!

* తాము అందంగా లేమనీ తమ ఫొటోలు అసలేం బాగా రావనీ భయపడి కెమెరాకి ముఖం చాటేయడాన్ని... స్కోపాఫోబియా అంటారు!

* తనకి నచ్చని మగ తుమ్మెదలు జతకట్టడానికి వస్తే... ఆడ తుమ్మెదలు చచ్చిపోయినట్టు నటిస్తాయి!

* అమెజాన్‌ అడవిలో నిత్యం వర్షాలు కురుస్తూనే ఉంటాయి. అలా కురిసిన వర్షపు నీరు భూమిని తాకాలంటే కనీసం ఐదు నిమిషాలు పడుతుంది. ఎందుకంటే అంత దట్టంగా, ఏపుగా అడవి పెరిగి ఉంటుందక్కడ.

* ఉత్తర కొరియాకు పర్యటనకు వెళ్లే ప్రయాణికులకు మొబైల్‌ అనుమతి లేదు. వాటిని ఎయిర్‌ పోర్టులోనే ఇచ్చేయాలి.

* ఏనుగులకు తేనెటీగలంటే చాలా భయం. అవి... ఏనుగు సున్నిత భాగాలైన తొండం లోపల, కంటి చుట్టూ కుడతాయనే ఆందోళనే అందుకు కారణమట.


దిల్లీలోని కేంద్ర హోమ్‌శాఖ, ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, విదేశీ మంత్రిత్వ శాఖల నుంచి ప్రధాన మంత్రి కార్యాలయం వరకూ అన్నీ అద్దె భవంతుల్లోనే పనిచేస్తున్నాయి! ఇందుకోసం అవి నెలనెలా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకి అద్దె చెల్లిస్తుంటాయి!


మెర్సిడెజ్‌ బెంజ్‌కి పుట్టినిల్లైన జర్మనీలో ట్యాక్సీలుగా వాడే కార్లలో ఎక్కువ బెంజ్‌ కార్లే కావడం విశేషం.


నీటి కుక్కలు(ఆటర్స్‌) చేయీచేయీ కలిపే నిద్రిస్తాయి... అలల తాకిడికి తమ గుంపు నుంచి వేరవకుండా ఈ జాగ్రత్త తీసుకుంటాయి.


* నేపాల్‌ ఎప్పుడూ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోలేదు. దీనికి కారణం ఎప్పుడూ అది విదేశీ ఆక్రమణలో లేదు. 2008 వరకూ రాచరిక పాలనలో ఉన్న ఆ దేశం తరువాత ఫెడరల్‌ డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌గా
అవతరించింది.


స్ట్రేలియా, కెనడా... ఇవి రెండూ పూర్తి స్వతంత్ర దేశాలే అయినా అధికారికంగా అవి ఇంకా బ్రిటిష్‌ మహారాణి పాలన కిందే ఉన్నట్టు లెక్క!


పిప్పి పన్నుని డ్రిల్‌ చేసి పీకే పద్ధతి 14000 ఏళ్ల కిందటే ఇటలీలో ఉన్నట్టు పురాతత్వ శాస్త్రవేత్తలు కనిపెట్టారు.


పులుల వెనక కాళ్లు చాలా బలమైనవి... ఎంతగా అంటే, నిల్చున్న భంగిమలో దాన్ని కాల్చి చంపినా సరే... వెనక కాళ్లు మాత్రం వంగిపోవట.


మీకు తెలుసా!

నుగులు అప్పుడప్పుడూ తమ శరీరంపైన మట్టిని చల్లుకోవడం చూస్తూనే ఉంటాం. అవి ఇలా ఎందుకు చేస్తాయో తెలుసా... నీళ్లల్లో స్నానం చేశాక.. ఎండ, వేడి ప్రభావం తమ ఒంటిపైన పడకుండా ఉండేందుకే మట్టిని చల్లుకుంటూ... ఆ మట్టిని సహజ సన్‌స్క్రీన్‌లా ఉపయోగించుకుంటాయట.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని