సిల్లీపాయింట్
మనం వేకువనే నిద్రలేస్తామా, రాత్రుళ్లు ఆలస్యంగా పడుకుని పొద్దెక్కాక లేస్తామా అన్న విషయం మన చేతిలో ఉండదట. మన శరీరంలోని 350 జన్యువులు దాన్ని నిర్ణయిస్తాయట!
సిల్లీపాయింట్
మనం వేకువనే నిద్రలేస్తామా, రాత్రుళ్లు ఆలస్యంగా పడుకుని పొద్దెక్కాక లేస్తామా అన్న విషయం మన చేతిలో ఉండదట. మన శరీరంలోని 350 జన్యువులు దాన్ని నిర్ణయిస్తాయట!
* కారులో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వెళితే, భూమి నుంచి చంద్రుణ్ని చేరుకోవడానికి ఆరునెలల సమయం పడుతుంది.
* ఖాళీ దొరికినప్పుడల్లా రాస్తుండటం... రాసి రాసి కుడిచేయి నొప్పిపుడితే ఎడమ చేతితో రాయడం మహాత్మాగాంధీకున్న అలవాటు! అలా వ్యాసాలూ, జీవితానుభవాలూ, ప్రకటనలూ అన్నీ కలిపి ఆయన రాసినవి 50 వేల పేజీలుంటాయి. ఇవి కాకుండా దాదాపు 10 లక్షల లేఖలూ ఉన్నాయి.
* ఒకే సంవత్సరం, ఒకే సమయం, ఒకే తేదీన పుట్టినప్పటికీ దక్షిణ కొరియన్లు మాత్రం ఇతర దేశస్థులకంటే వయసులో ఓ ఏడాది పెద్దవాళ్లై ఉంటారు. అదెలాగంటారా?... ఆ దేశంలో పిల్లలు పుట్టగానే మొదటి ఏడాది నిండినట్లుగానే లెక్కిస్తారు మరి!
* గోల్డెన్ పాయిజన్ డార్ట్ రకం కప్ప.. చర్మం నుంచి ఉత్పత్తి చేసే గ్రాము టాక్సిన్ లక్షమంది ప్రాణాలు తీయగలదట.
* కుక్కల వల్ల మనుషులకి వాటిల్లే ప్రమాదాలను పక్కన పెడితే... వాటికి వచ్చే అలర్జీల్లో ఎక్కువ శాతానికి కారణం మనుషులేనట.
* జర్మనీలో ఇల్లు లేని వారికోసం వీధుల్లో స్లీపింగ్ పాడ్స్ ఉంటాయి. నిరాశ్రయులు ఎవరైనా అక్కడ పడుకోవచ్చు.
* కోకాకోలా కంపెనీ తయారుచేసే ‘ఫాంటా’ డ్రింకుల్లో మనదగ్గర ఆరెంజ్ ఫ్లేవర్‌దే హవా! అదే థాయిల్యాండ్‌లో స్ట్రాబెర్రీ ఫ్లేవరే పాపులర్. కాకపోతే, అక్కడ వాటిని తాగటానికి కాకుండా ప్రధానంగా పూజల్లో వాడతారు. ఒకప్పుడు దేవుళ్ల దగ్గర జంతువుల రక్తాన్ని నైవేద్యంగా పెట్టే ఆచారానికి... ప్రత్యామ్నాయంగా ఎర్రెర్రగా ఉండే ఈ పానీయాన్ని ఉంచుతున్నారట. అక్కడి ఫాంటా అమ్మకాల్లో 70 శాతం ఇలా గుళ్ళకే వెళుతోందట మరి!
* కూరగాయల్ని చూసి భయపడటాన్ని లచనోఫోబియా అని అంటారు.
* విమానాలన్నింటిలోనూ ధూమపానాన్ని నిషేధించినా వాష్‌రూముల్లో యాష్ ట్రే మాత్రం తప్పనిసరిగా పెడుతున్నారు!
* ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ గంటకు 32,500 కి.మీటర్ల వేగంతో తిరుగుతుంది. అందువల్లే అందులో ఉన్నవారు 45 నిమిషాలకు ఒకసారి సూర్యాస్తమయం లేదా సూర్యోదయాన్ని చూస్తారు.
1965లో తొలిసారీ, 1971లో రెండోసారీ జరిగిన ఇండో-పాక్ యుద్ధాల్లో ఎన్‌సీసీ విద్యార్థినీ విద్యార్థులు... రెండో అంచె(సెకెండ్‌లైన్) భద్రతాదళంగా పాల్గొన్నారు. ఆ తర్వాత వాళ్ళనెప్పుడూ యుద్ధాలకి తీసుకెళ్ళలేదు.
గ్రీకు పురాణంలో భూమ్యాకాశాల్ని మోసే దేవుడి పేరు అట్లాస్. అందుకే ప్రపంచంలోని మ్యాప్‌లన్నీ ఒకేచోట ఉండే పుస్తకానికి అదే పేరు. అంతేకాదు, మన వెన్నెముక పైభాగాన్ని కూడా అట్లాస్ అనే అంటారు. ఎందుకూ అంటారా... ఆ భాగమే మన తలమొత్తాన్నీ మోస్తుంది కాబట్టి!
మెక్సికో దేశంలో స్వీట్లలో కూడా కారం ఉండాల్సిందే! ప్రపంచంలో కారం ఎక్కువగా ఉండే ఆహారం తినేది అక్కడి ప్రజలేనట.
రెండో ప్రపంచ యుద్ధంలో జపనీయులు కొబ్బరికాయల్లో పేలుడు పదార్థాలు పెట్టి శత్రువులపైన వేసేవారట!
మల్లెల్లో 200 రకాలున్నాయి. వాటిల్లో 199... ఆసియా, ఆస్ట్రేలియాలకు చెందినవి. ఒక్కటి... ఐరోపాలో పూస్తుంది. అమెరికా ఖండాల్లో మల్లెలు అసలు లేనేలేవు!
పరీక్షా ఫలితాలేవైనా సరే... పత్రికల్లో ప్రచురించే సంప్రదాయం అమెరికాలో లేదు. విద్యాసంస్థలే వాటినిచేరవేస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే వజ్రాల్లో 90 శాతం వాటికి... మనదేశంలోని సూరత్‌లోనే సానపడతారు!
పిచ్చుకలు... మనుషులున్న ఇళ్ళూ ఊళ్ళలో తప్ప ఇంకెక్కడా మనలేవు. కాకులు ఇందుకు పూర్తిగా భిన్నం... అవి అడవికి పోయినా ఉండగలవు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: ఇద్దరు చిన్నారులు కిడ్నాప్.. గంటల వ్యవధిలో నిందితుల అరెస్టు
-
Crime News
Heart attack: పెళ్లి రోజే.. గుండెపోటుతో నవదంపతుల మృతి
-
Sports News
WTC Final: అతడికి బౌలింగ్ చేసినా.. సచిన్‌కు చేసినా ఒకేలా భావిస్తా: వసీమ్ అక్రమ్
-
Politics News
CM KCR: ధరణి వద్దన్న వాళ్లనే బంగాళాఖాతంలో కలిపేద్దాం: సీఎం కేసీఆర్
-
India News
Odisha Train Accident: ఒడిశా రైలు దుర్ఘటన.. సీబీఐ విచారణకు రైల్వేబోర్డు సిఫారసు
-
India News
Odisha train Tragedy: లోకో పైలట్ తప్పిదం లేదు..! ‘సిగ్నల్ వ్యవస్థ’ను ఎవరు ట్యాంపర్ చేశారు..?