సిల్లీపాయింట్‌

తేనెటీగలు, మనుషుల్నీ, ఇతరత్రా జంతువుల్నే కాదు... తమ తోటి తేనెటీగల్ని కూడా కుడతాయి. వాటి స్థానాన్ని ఆక్రమించుకుంటాయనే భయం, ఇతరత్రా ఆందోళనలే అందుకు కారణమట.

Published : 02 Oct 2022 00:26 IST

సిల్లీపాయింట్‌

తేనెటీగలు, మనుషుల్నీ, ఇతరత్రా జంతువుల్నే కాదు... తమ తోటి తేనెటీగల్ని కూడా కుడతాయి. వాటి స్థానాన్ని ఆక్రమించుకుంటాయనే భయం, ఇతరత్రా ఆందోళనలే అందుకు కారణమట.


* వేసవి తాపాన్ని తీర్చే పుచ్చకాయని మెచ్చనివారు ఉండరు. కానీ, బ్రెజిల్‌లోని రియోక్లారోలో మాత్రం ఈ పండుని తినలేరు. ఎందుకంటే, ఎల్లోఫీవర్‌కి కారణమవుతుందనే భయంతో 18వ శతాబ్దంలోనే దీన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది. అప్పటి నుంచీ ఆ నిబంధన అలాగే కొనసాగుతోంది.


* హాంకాంగ్‌లో మోసం చేసిన భర్తను భార్య స్వయంగా తన చేతులతో చంపడం నేరం కాదు. పైగా చట్టబద్ధం కూడానూ. ఒకవేళ అలా చంపడం ఆమెకు ఇష్టం లేకపోతే ఇతర మార్గాల్లో శిక్షను అమలు చేసే వెసులుబాటు కూడా ఉందక్కడ.


నీలి తిమింగలం నాలుక ఏనుగు కంటే బరువు ఉంటుంది.


భారత్‌, పాకిస్తాన్‌లు రెండూ తమ తొలి స్వాతంత్య్ర దినోత్సవాల్లో నాటి వైస్రాయ్‌ మౌంట్‌బాటన్‌ పాల్గొనాలని కోరుకున్నాయి. ఆయన ముందు రోజు(ఆగస్టు 14న) పాకిస్తాన్‌ వెళ్లి, మర్నాడు భారత్‌ వచ్చారు. అవే ఇరుదేశాలకి జెండా పండగలయ్యాయి!


శాండ్‌బాక్స్‌ చెట్టుకి కాసే పళ్లు పక్వానికి వచ్చాక పెద్ద శబ్దం చేస్తూ పగులుతాయి. ఆ సమయంలో సెకనుకి 70 మీ వేగంతో, 100 మీటర్ల కంటే ఎక్కువ దూరం వరకూ వాటి విత్తనాలను వెదజల్లుతాయి. అందుకే ఈ చెట్టుని డైనమైట్‌ ట్రీ అని కూడా అంటారు.


* స్విట్జర్లాండ్‌లో ఆదివారాల్లో కార్లను కడగకూడదనే నిబంధన ఉంది. ఒకవేళ ఎవరైనా కడిగితే మాత్రం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.


సీతాకోకచిలుకల శరీర ఉష్ణోగ్రత 86 డిగ్రీల కంటే తక్కువ ఉంటే అవి ఎగరలేవు.


థాయ్‌లాండ్‌లో భవనాల బయట ‘స్పిరిట్‌హౌస్‌’ పేరుతో గూళ్లు కడతారు. అక్కడ ఆత్మలకు బహుమతులూ, నైవేద్యాలూ పెడతారు. ఇలా చేస్తే ఆత్మలు సమీపంలో ఉన్నవారిని ఏమీ చేయవని ఆ ప్రాంత వాసుల నమ్మకం.


త్తర కొరియాలో ప్రజలందరూ వారి చొక్కాలపై ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ ఉన్‌ తాత లేదా తండ్రి పేరుతో ఉన్న బ్యాడ్జీలను కచ్చితంగా ధరించాలి. అది లేకుండా ఇల్లు దాటితే మాత్రం శిక్ష తప్పదు.


ప్రపంచాన్ని వణికించిన అడాల్ఫ్‌ హిట్లర్‌ శుద్ధ శాకాహారి.


* వారంలో ఎక్కువ ఉత్పాదకతను అందించే రోజు మంగళవారమట.


* ఆఫ్రికాలో కనిపించే బావోబాబ్‌ చెట్టు కాండంలో 1,20,000 లీటర్ల నీటిని నిల్వ చేయొచ్చట.


* అమెరికాలోని డెనివర్‌ అనే ప్రాంతంలో ఆదివారంనాడు నల్ల కారుతో రోడ్డెక్కడం నేరమట. నిజానికి ఆ నిబంధన ఎందుకు పెట్టారన్న విషయం అక్కడున్న ప్రజలకి కూడా తెలియదు. కానీ... ఈ నియమాన్ని మాత్రం ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్‌గా పర్యవేక్షిస్తుంది.


* అమెరికన్లు ఏసీల కోసం ఖర్చు చేసే కరెంట్‌... ఆఫ్రికా ఖండమంతా వినియోగించే విద్యుత్తు కంటే ఎక్కువట.


గుడ్లగూబల సమూహాన్ని పార్లమెంట్‌ అని పిలుస్తారు.


* పాకిస్తాన్‌ పౌరులెవరికీ ఇజ్రాయెల్‌ సందర్శించేందుకు అనుమతి లేదు. ఎందుకంటే, పాకిస్తాన్‌ అసలు దాన్ని ఓ దేశంగానే గుర్తించడం లేదు. ఈ కారణం చూపించే...  ఎవరికీ వీసాలూ జారీ చేయడం లేదు.


ఇండోనేషియా, పపువా న్యూగినియా దేశాల్లో కనిపించే యూకలిప్టస్‌ చెట్టు బెరడు నీలం, నారింజ, ముదురు ఎరుపు, లేత ఆకుపచ్చ, బూడిద రంగులతో ఇంద్రధనుస్సుని తలపిస్తుంది.


మీకు తెలుసా!

న కంట్లో ఉన్న లెన్స్‌... కాన్వెక్స్‌ (కుంభాకారం అంటారు) రకానికి చెందింది. ఈ రకం లెన్స్‌లు ప్రతి బింబాన్ని తలకిందులుగా చూపిస్తాయి. అంతేకాదు, కుడిని ఎడమగానూ, ఎడమని కుడిగానూ చూపిస్తాయి. మరి కంట్లో అలాంటి లెన్స్‌ ఉన్నప్పుడు- మనం సరైన ఆకారాన్ని ఎలా చూడగలుగుతున్నాం... అంటారా! మన మెదడుకి ఆ శక్తి సహజంగానే వస్తుంది. కాకపోతే, ఆ శక్తి పుట్టుకతోనే రాదు. పుట్టిన రెండుమూడు వారాలకి వస్తుంది. అప్పటిదాకా- మనం ఈ ప్రపంచాన్ని తలకిందులుగానే చూస్తూ ఉంటాం మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..