సిసింద్రీ

పూర్వం విజయపురి రాజ్యంలో వల్లభుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతడికి ఎలా అయినా సరే సంజీవని జలం సాధించాలనే కోరిక ఉండేది. అడవికి వెళ్లి పద్నాలుగు సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు.

Updated : 27 Feb 2022 00:42 IST

సిసింద్రీ





విరామం... విజ్ఞానం... వినోదం..!

ఎంతసేపని చదువుకుంటాం... చెప్పండి ఫ్రెండ్స్‌. అలా అని విలువైన సమయాన్ని కూడా వృథా చేసుకోవడమూ కరెక్ట్‌ కాదు. మరి బోర్‌ కొట్టకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి కదా... ఆ చేసేదేదో... వినోదానికి వినోదం... విజ్ఞానానికి విజ్ఞానం అందించేదై ఉంటే ఎంత బాగుంటుంది. అలాంటిదే https://www.funbrain.com/. ఈ వెబ్‌సైట్‌లోనూ మంచి మంచి ఆటలుంటాయి. లెక్కలు నేర్పే మ్యాథ్స్‌ బేస్‌బాల్‌, బ్యాలెన్సింగ్‌ నేర్పించే పిగ్‌పైల్‌, రాక్షసి ఆటకట్టించే కేక్‌మాన్‌స్టర్‌ లాంటి బోలెడు గేమ్స్‌ ఉంటాయి. వినోదాన్నీ విజ్ఞానాన్నీ పంచే వీడియోలూ ఉంటాయి. కేవలం ఆటలూ, వీడియోలే కాదు చక్కటి కామిక్‌ ఈ-బుక్స్‌ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్‌. మరింకేం ఈ రోజు ఎలాగూ ఆదివారమే కదా... స్కూలుకూ సెలవే. కాసేపు ఈ https://www.funbrain.com/ లో విహరించేయండి సరేనా!


 


వల్లభుడి తపస్సు

పూర్వం విజయపురి రాజ్యంలో వల్లభుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతడికి ఎలా అయినా సరే సంజీవని జలం సాధించాలనే కోరిక ఉండేది. అడవికి వెళ్లి పద్నాలుగు సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. చివరికి దేవుడు ప్రత్యక్షమై... ‘వల్లభా... నీ తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో’ అన్నాడు. దానికి వల్లభుడు ‘భగవంతుడా... నాకు సంజీవని జలం కావాలి’ అని వేడుకున్నాడు. ‘వల్లభా... అది సృష్టికి విరుద్ధం. దీని వల్ల సమస్యలొస్తాయి’ అని భగవంతుడు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ వల్లభుడు వినలేదు. తనకు సంజీవని కావాల్సిందే అని పట్టుపట్టాడు. చివరికి దేవుడు అతడికి సంజీవనిని అనుగ్రహించి అదృశ్యమయ్యాడు. వల్లభుడు పట్టరాని ఆనందంతో కేరింతలు కొట్టాడు. గెంతులు వేశాడు. ‘అరరె... దేవుణ్ని చూసిన ఆనందం, తన్మయత్వంలో ఈ సంజీవని జలాన్ని ఆయన ముందే ఉపయోగించడం మర్చిపోయానే’ అని బాధపడ్డాడు. ఇంతలోనే వల్లభుడికి దేవుడి మీద అనుమానం వచ్చింది. ‘అవును... ఈ దేవుడు ముందు సంజీవనిని అడిగితే అది సృష్టికి విరుద్ధం అని చెప్పాడు. పట్టుబడితే కానీ ఇవ్వలేదు. ఇది నిజంగా సంజీవనేనా? లేక దేవుడు నన్ను మోసం చేశాడా?’ అని సందేహించాడు. ‘సరే... ఇంతగా ఆలోచించి బుర్రపాడు చేసుకోవడం ఎందుకు? ఓ సారి పరీక్షించి చూస్తే సరిపోతుంది కదా. తర్వాత నేనూ వాడితే సరి’ అనుకున్నాడు. అంతలో అతనికి ఎలుగుబంటి మృతకళేబరం కనబడింది. అది బాగా కుళ్లి పోయిన స్థితిలో ఉంది. దేవుడు తనకు ఇచ్చిన సంజీవనిని కాస్త దాని మీద చిలకరించాడు. అద్భుతం జరిగింది! కొన్ని క్షణాల్లోనే ఆ ఎలుగుబంటి లేచి కూర్చుంది. అది చనిపోయి చాలా రోజులైంది... కాబట్టి అది చాలా ఆకలి మీద ఉంది. దాని కళ్లముందే వల్లభుడు ఉండటంతో వెంటనే దాడి చేసింది. వల్లభుడు తప్పించుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాని చేతిలో ప్రాణాలు కోల్పోయి, దానికి ఆహారంగా మారాడు. ఘోర తపస్సు చేసి సంజీవనిని సాధించినా... చివరకు ఇలా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది.



 


అడ్డమా... నిలువా!

టీచర్‌: బంటీ... 8లో సగం ఎంత?
బంటి: అడ్డంగా కోస్తే 0, నిలువుగా కోస్తే 3 టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


జవాబులు

తేడాలేంటి: 1. పక్షిరెక్క 2. కొబ్బరి చెట్టు 3. టమోటా 4. అమ్మాయి సాక్సు 5. నిచ్చెన 6. అబ్బాయి చొక్కా 7. క్యారెట్‌ 8. ఇళ్ల మధ్యలో దారి.
పోలికలేంటి: అడ్డం: పిల్లలు నిలబడి ఉన్నారు, హాఫ్‌ హ్యాండ్స్‌ షర్ట్‌, పండ్లు; నిలువు: నిలువు గీతల చొక్కా, పుస్తకాలు, అమ్మాయి; ఐమూలగా: సూర్యుడు, చెత్తబుట్ట.
తాతయ్య ఎవరు?: 4వ చిత్రంలో ఉన్న వ్యక్తి
దాగుడు మూతలు: బాబు చొక్కా మీద కళ్లద్దాలు, చక్రాల బండికి భూతద్దం, కుక్క కాలు మీద పురుగు, చెట్టు మీద పైనాపిల్‌, మరో చెట్టు మీద హెడ్‌సెట్‌, కంచెకు సిరంజి, బెంచీ మీద పెన్ను, నేలమీద స్కేలు.
జత చేయండి: 1-ఐ, 2-హెచ్‌, 3-జి, 4-ఎఫ్‌, 5-ఇ, 6-డి, 7-సి, 8-బి, 9-ఎ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..