సిసింద్రీ

హేంద్రపురానికి రాజైన విజయశేఖరుడు మూర్ఖుడు. ఓ రోజు రాజ్య పర్యటన చేస్తూ ఒక సంతలోకి వెళ్లాడు. అక్కడ వేట కుక్కల అమ్మకాలు జరుగుతున్నాయి. వ్యాపారస్తులందరూ రాజుగారికి అధిక ధరకు వాటిని అమ్మాలను కున్నారు. ‘నా వేటకుక్కకు అలుపన్నదే లేదు’ అని ఒకరంటే.

Updated : 10 Apr 2022 05:59 IST

సిసింద్రీ

అప్పటికి చూసుకుందాంలే!

హేంద్రపురానికి రాజైన విజయశేఖరుడు మూర్ఖుడు. ఓ రోజు రాజ్య పర్యటన చేస్తూ ఒక సంతలోకి వెళ్లాడు. అక్కడ వేట కుక్కల అమ్మకాలు జరుగుతున్నాయి. వ్యాపారస్తులందరూ రాజుగారికి అధిక ధరకు వాటిని అమ్మాలను
కున్నారు. ‘నా వేటకుక్కకు అలుపన్నదే లేదు’ అని ఒకరంటే... ‘ఈ కుక్క తక్కువ తింటుంది. ఎక్కువ వేటాడుతుంది’ అని మరొకరు... ‘దీనికి ఈత కూడా వచ్చు’ అని ఇంకొకరు... ఇలా ఎవరికి వారు గొప్పలు చెప్పారు. ఇంతలో
ఓ వ్యాపారస్తుడు ‘రాజా... ఈ కుక్క ఎగరగలదు’ అన్నాడు. వెంటనే రాజు దాన్ని కొనుక్కొని వెళ్లాడు. మర్నాడు సేనాధిపతిని... ‘ఈ కుక్కను ఎగిరించు’ అన్నాడు. ఎంత ప్రయత్నించినా అది ఎగరలేదు. రాజు కోపంగా... ‘ఆ వ్యాపారిని నా ముందు ప్రవేశపెట్టండి’ అని ఆదేశించాడు. వ్యాపారస్తుడు రాగానే... ‘నిన్న నీ వేటకుక్క ఎగురుతుంది అన్నావు కదా, ఏదీ ఒకసారి ఎగిరించి చూపించు’ అన్నాడు.

‘రాజా! ఎగరడం అంటే నా ఉద్దేశం కుక్క చాలాదూరం దూకుతుందని...’ చెప్పాడు వ్యాపారస్తుడు. వెంటనే... ‘ఇతని తల నరికేయండి’ అని రాజు భటులను ఆదేశించాడు. ఆ తర్వాత మంత్రిని పిలిచాడు... ‘మంత్రివర్యా! ఈ కుక్కను
మీరు ఎగిరించండి’ అన్నాడు. ‘మహారాజా!

ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు కదా!’ అన్నాడు. మహారాజు మంత్రిని చెరసాలలో వేయించాడు. ఇలా రాజు రోజూ ఒక్కొక్కరినే పిలిచి వారిని చెరసాలలో వేయడమో, తల తీసేయడమో చేసేవాడు.

ఒక రోజు చిరుద్యోగి అయిన ఆనందుణ్ని పిలిచి కుక్కను ఎగిరించమని ఆజ్ఞాపించాడు. ఆనందుడు తల వంచి... ‘అలాగే ప్రభూ! నాకు ఏడాది గడువు ఇవ్వండి’ అన్నాడు. రాజు ఒప్పుకున్నాడు. ఊరంతా నిప్పులా పాకిపోయిన ఈ వార్త ఇంట్లో ఉన్న అతని భార్యకు కూడా తెలిసింది. భర్త ఇంటికి రాగానే ‘ఎందుకిలా చేశావు?’ అని నిలదీసింది. ‘నీకు తెలుసు కదా... మూర్ఖుడైన మన రాజు మంత్రినే చెరసాలలో వేయించాడు. ప్రస్తుతానికి ప్రమాదం తొలగింది కదా’ అన్నాడు. ‘తర్వాత
ఏం చేస్తావు?’ అని అడిగింది. ‘అప్పటికి ఎవ్వరు రాజో... ఎవ్వరు మంత్రో... రాజు ఈ విషయమే మరిచిపోవచ్చేమో!

అయినా అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం లే’ అంటూ ఆనందుడు హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు.


‘ఏబీసీవైఏ’లో విహరిద్దామా!

ఏబీసీవైఏ... ఇది మనలాంటి నేస్తాలకు ఎంతో నచ్చుతుంది. ఎందుకంటే http://www.abcya.com/ సైట్‌లో ఏ టూ జెడ్‌ దొరుకుతాయి. ఆనందం... ఆహ్లాదం... విజ్ఞానం ఇలా అన్నీ ఒక్క చోటే కనువిందు చేస్తాయి. ఇక గేమ్స్‌కైతే లెక్కేలేదు. యాక్టివిటీస్‌కైతే కొదవేలేదు. ఈ సైట్‌లో గ్రేడ్‌ల వారీగా గేమ్స్‌, యాక్టివిటీస్‌ పొందుపరిచి ఉంటాయి. మనకు నచ్చిన గ్రేడ్‌ను ఎంచుకుంటే ఆ జాబితాలో ఉన్న గేమ్స్‌, యాక్టివిటీస్‌ మన కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. వాటి మీద క్లిక్‌ చేస్తే ఇక కిక్కే కిక్కు! క్రాస్‌ వర్డ్‌ పజిల్‌ క్రియేటర్‌, ఫన్‌ ఫ్యాక్టరీ, వర్డ్‌ సెర్చ్‌క్రియేటర్‌, హాకీ స్కోర్‌, పప్పీచేస్‌, బీచ్‌ సుడోకు, డ్రాయింగ్‌... ఇలా ఒక్కటేమిటి కొన్ని వందల గేమ్స్‌ మనకోసం సిద్ధంగా ఉంటాయి. వీడియోలూ, కార్టూన్లూ, కామిక్‌ల రూపంలో మనకు వినోదాన్నీ, విజ్ఞానాన్నీ పంచుతాయి. ఆడుతూ పాడుతూనే చదువూ నేర్చుకోవచ్చు. గణితం, ఆంగ్ల పరిజ్ఞానాన్ని మెరుగుపరిచే పజిల్స్‌, గేమ్స్‌ కూడా ఈ సైట్‌లో ఉన్నాయి. ఇంకా ఆలస్యం ఎందుకు... ఓ సారి మీరూ ఎంచక్కా ఈ వెబ్‌సైట్‌ను చూసేయండి. మీకూ కాస్త ఆటవిడుపుగా ఉంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్‌!  


చెప్పగలరా?

అదో అయిదంకెల సంఖ్య. ఆ అంకెలన్నీ కలిపితే మొత్తం అయిదవుతుంది. మొదటి అంకె అందులోని సున్నాల సంఖ్యనూ, రెండోది ఒకట్ల సంఖ్యనూ సూచిస్తుంది. మొదటి అంకె, మూడో అంకె విలువ సమానం. నాలుగో అంకె, అయిదో అంకెలకు విడిగా అసలు విలువ ఉండదు. రెండో అంకెకు జత లేదు. ఇంతకీ ఆ సంఖ్య ఏంటో చెప్పగలరా?



జవాబులు

తేడాలేంటి?: 1. ఊగే బల్ల హ్యాండిల్‌ 2. బాబు చొక్కా మీద అంకె 3. పాప హెయిర్‌ బ్యాండ్‌ 4. ఇంటిని ఆనుకుని ఉన్న కంచె 5. బాబు నిక్కరుపై డిజైన్‌ 6. చేతి గ్లవ్‌ 7. పిల్లాడి షూ 8. రాయి మీద కూర్చుని ఉన్న అబ్బాయి చొక్కా మీద పట్టీలు.
దాగుడు మూతలు: టెడ్డీ బేర్‌ బొమ్మ మీద గరిటె, స్కూటర్‌ బొమ్మపైన బ్రష్‌, అబ్బాయి చొక్కా మీద పురుగు, కుండీలోని మొక్కపైన టోపీ, సోఫాపై స్కేలు, కుండీ ఉన్న టేబుల్‌కు సెల్‌ఫోన్‌, బ్యాగ్‌పైన బంతి, పాప చొక్కా మీద మామిడిపండు.
పోలికలేంటి?: అడ్డం: బ్రెడ్‌, నీళ్ల గ్లాసు, టోపీ; నిలువు: ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, కిటికీ, సూట్‌కేస్‌; ఐమూలగా: లాలీపాప్‌, టీ కప్పు.
దారి చూపండి: బంటి
ప్రతిబింబం ఏది?: D
చెప్పగలరా?: 21200


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..