ఈ పాట... ప్రపంచ పాట!
హాయ్ ఫ్రెండ్స్... మన స్నేహితుల పుట్టిన రోజు వేడుకల్లో మనం ‘హ్యాపీ బర్త్‌డే టూ యూ..’ అని పాడి శుభాకాంక్షలు చెబుతాం కదా! అంతవరకూ బాగానే ఉంది కానీ... అసలు ఈ పాట గురించి మీకు ఏమైనా తెలుసా?!... తెలియకున్నా ఫర్లేదు... ఇప్పుడు తెలుసుకుందాం సరేనా! నిజానికి ‘హ్యాపీ బర్త్‌డే టూ యూ’ పాట అసలు రూపం ఇప్పుడున్నది కాదు. మొదట్లో ‘గుడ్ మార్నింగ్ టూ ఆల్...’ అని ఉండేది. ఈ గుడ్ మార్నింగ్ పాటను అమెరికాకు చెందిన అక్కాచెల్లెళ్లు మిల్డ్ రెడ్ హిల్, ప్యాటీ హిల్ రాశారు. అప్పట్లో ఈ పాట ఎంతోమంది చిన్నారులను అలరించింది. అమెరికాలోని దాదాపు అన్ని స్కూళ్లలో ఈ పాట సందడి చేసేది. ఈ గేయం 1893లో ఓ పుస్తకంలో ప్రచురితమైంది. కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే పాట ‘హ్యాపీ బర్త్ డే టూ యూ’గా మారింది. మొదటిసారిగా 1924లో పాటల పుస్తకంలో చేరింది. తర్వాత ప్రపంచమంతా పాకిపోయింది. ఈ పాట 18 భాషల్లో అనువాదం అయింది. ఆంగ్లంలో అత్యధిక గుర్తింపు పొందిన పాటగా 1998లో ఏకంగా గిన్నిస్ రికార్డే సాధించింది. ఇవీ నేస్తాలూ... ‘హ్యాపీ బర్త్ డే టూ యూ’ పాట విశేషాలు!
శిష్యుల ఉపవాసం!
వాళ్లంతా పరమానందయ్య శిష్యులు. ఒకసారి గురువు గారు ఒక్కరే ఏదో పనిమీద పొరుగూరు వెళ్లారు. ఆ రోజు శిష్యులు ఉపవాసం ఉండాలనుకున్నారు. ‘మనకు కావాల్సిన ఆహారం ముందే తెచ్చి పెట్టుకుంటే మంచిది. ఉపవాసం ముగిసిన వెంటనే ఎంచక్కా తినొచ్చు’ అన్నాడు ఆ శిష్యుల్లో ఒకడు. మిగిలిన శిష్యులందరికీ ఆ ఆలోచన ఎంతో నచ్చింది. వాళ్లంతా కలిసి బాగా మగ్గిన అరటిపండ్లను తెచ్చుకున్నారు. ‘వీటిని ముందే వాటాలేసుకుంటే మంచిది. ఉపవాసం ముగిశాక కష్టమవుతుంది’ అన్నాడు మరో శిష్యుడు. మిగతా వారికీ అది సబబుగానే అనిపించడంతో... వెంటనే వాటాలేసుకున్నారు. ఇంతలో మరో శిష్యుడు... ‘ఎందుకైనా మంచిది. మనం ముందుగానే తొక్కలు తీసి సిద్ధంగా పెట్టుకుందాం. ఉపవాసం ముగిశాక తొక్కలు తీసుకునేంత ఓపిక ఉంటుందో... ఉండదో’ అన్నాడు. ‘అవును. అదీ నిజమే’ అన్నారు మిగతావాళ్లు. వెంటనే అరటి పండ్లకు తొక్కలు తీసి, పక్కనపెట్టుకొని ఉపవాస దీక్షకు సిద్ధమయ్యారు. కాసేపటికి ఓ శిష్యుడు నిల్చొని... ‘చూడండి... గాలికి పండ్లపైన దుమ్ము ఎలా పడుతుందో... పైగా ఈగలు కూడా వాలుతున్నాయి. సాయంత్రం వరకూ ఇలాగే ఉంటే ఆ దుమ్ము పట్టిన అరటిపండ్లను తినాల్సి వస్తుంది. ఓ పని చేద్దాం... ఆ పండ్లను మన నోట్లోనే పెట్టుకుని ఆ ఉపవాసమేదో చేసేద్దాం’ అన్నాడో శిష్యుడు. ‘అవును నిజమే... పొట్టలోకి వెళ్లనంత వరకూ ఉపవాసం ఉన్నట్లే కదా! అలాగే చేద్దాం’ అన్నాడు ఇంకో శిష్యుడు. వాళ్లందరూ... తొక్క తీసిన అరటిపండ్లను ఒక్కోటి నోట్లో పెట్టుకుని ఉపవాసం ప్రారంభించారు. కానీ కాసేపటికే తినేశారు. ‘అసలు మనలాంటి జ్ఞానులు ఉపవాసం ఉండాల్సిన అవసరమే లేదు’ అని ఓ శిష్యుడు అనగానే... ‘అవునవునూ... ఎక్కడో చదివినట్లు గుర్తు’ అంటూ మిగతావారూ వంతపాడారు. మొత్తానికి మొదలు పెట్టిన మూడు నిమిషాల్లోపే ఉపవాసం ముగించేశారు!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Kadapa: కడప నడిబొడ్డున ఇద్దరు యువకుల దారుణహత్య
-
World News
Miss Universe : మిస్ యూనివర్స్ పోటీలు.. నన్ను చూసి వారంతా పారిపోయారు..!
-
Movies News
Samantha: ఎంతోకాలం తర్వాత గాయని చిన్మయి గురించి సమంత ట్వీట్
-
India News
Parliament: ‘అదానీ - హిండెన్‌బర్గ్’పై చర్చకు విపక్షాల పట్టు.. పార్లమెంట్లో గందరగోళం
-
Crime News
Hyderabad: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇంట్లో భారీ చోరీ
-
Sports News
IND vs NZ: సవాళ్లను స్వీకరించడం బాగుంటుంది.. అందుకే తొలుత బ్యాటింగ్: హార్దిక్ పాండ్య