కుండలు చేసేద్దామా!
క్షణం ఖాళీ దొరికితే చాలు... మనలో చాలామంది టీవీలో దూరిపోతారు. లేకపోతే... స్మార్ట్‌ఫోన్‌లో లీనమైపోతారు. అలాంటి వారు కాసేపు చక్కగా ఆడుకోవడానికి ఈ బొమ్మ భలేగా ఉంటుంది. అదే pottery wheel kit. ఈ కిట్ సహాయంతో ఎంచక్కా కుండలూ, పాత్రలూ తయారు చేయొచ్చు. అంటే నిజమైనవి కాదనుకోండీ... ఊరికే సరదాగా ఆడుకునే బొమ్మలన్నమాట. వీటిని అలంకరణకూ వాడుకోవచ్చు. ఈ కుండల తయారీ కిట్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీనికి ఆన్ఆఫ్ స్విచ్ ఉంటుంది. అక్కడే - ఈ బొమ్మ పైన ఉన్న ప్లేట్ తిరిగే వేగాన్ని కంట్రోల్ చేసే ఏర్పాటూ ఉంటుంది. ముందుగా మట్టి ప్యాకెట్‌ను తెరిచి... దాన్ని బొమ్మకున్న తిరిగే ప్లేట్‌పైన పెట్టి స్విచ్ ఆన్ చేయాలి. ఇప్పుడు మన రెండు చేతులూ ఉపయోగించి కుండను కానీ, పాత్రలను కానీ తయారు చేయాలి. అంతేకాదు నేస్తాలూ... దీంతో పెన్‌స్టాండ్ కూడా చేసేయొచ్చు తెలుసా! మొదట్లో కాస్త కష్టంగా ఉంటుంది కానీ... చేస్తూ చేస్తూ ఉంటే తేలికవుతుంది. ఇలా తయారైన వస్తువును ఎండనివ్వాలి. తర్వాత మనకు నచ్చిన రంగులు వేసుకోవాలి. ఆ రంగులు కూడా ఈ బొమ్మతో పాటే వస్తాయి. ఈ కుండల తయారీ బొమ్మ కిట్ ఆన్లైన్లో అందుబాటులో ఉంది నేస్తాలూ!
ఆత్మసంతృప్తి!
ఉదయగిరిని పాలించే చేతనవర్మ ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. రాజ్యాధికారం, సకల సంపదలూ ఉన్నా... ఇంకా ఏదో వెలితి ఉన్నట్లు బాధపడేవాడు. అదే విషయం ఓ స్వామీజీకి చెప్పి, పరిష్కారం కోరాడు. స్వామీజీ కొన్ని క్షణాలు ఆలోచించి... ‘సంతోషంగా జీవించే వ్యక్తి చెప్పులు తెచ్చుకుని ధరిస్తే మీ సమస్య తీరిపోతుంది’ అన్నాడు. రాజు తన మంత్రినీ, ఆస్థానంలోని కవులనీ, సైనికులనూ ఇలా అందరినీ... ‘మీరంతా సంతోషంగా జీవిస్తున్నారా?’ అని అడిగాడు. ఎవరూ ‘అవును’ అనలేదు. దీంతో ‘మీకు వారం గడువిస్తున్నా... రాజ్యం మొత్తం జల్లెడ పట్టి సంతోషంగా జీవించే వ్యక్తిని కనిపెట్టి, తీసుకురండి’ అని భటులను ఆదేశించాడు రాజు. రాజ్యం మొత్తం గాలించినా, ఏ సమస్యా లేకుండా జీవిస్తున్న వాళ్లు ఒక్కరూ కనిపించలేదు. అదే విషయాన్ని వాళ్లు రాజు దృష్టికి తీసుకొచ్చారు. ఆయన అసంతృప్తితో ‘నేనే ఆ వ్యక్తిని కనిపెడతా’ అంటూ బయలుదేరాడు. అడవికి దగ్గర్లో చక్కగా పాటలు పాడుకుంటూ, ఆవుల్ని మేపుతున్న ఓ వ్యక్తి రాజుకు కనిపించాడు. రాజు అతని దగ్గరికెళ్లి... ‘నువ్వు ఇంత ఆనందంగా పాటలు పాడుతున్నావు. నీకు సమస్యలేమీ లేవా?’ అని అడిగాడు. ‘నాకేం... కాళ్లూ, చేతులూ చక్కగా ఉన్నాయి. తిండికి సరిపడా సంపాదించుకుంటున్నా. హాయిగా పశువుల్ని కాస్తున్నాను. ఇంతకంటే ఇంకేం కావాలి’ అన్నాడతను. ఆ మాటలు వినగానే, తనకు కావాల్సిన వ్యక్తి దొరికాడని రాజు తెగ సంబరపడ్డాడు. ‘నీకు కావాల్సినంత డబ్బిస్తాను. నీ చెప్పులు నాకు కావాలి’ అని అడిగాడు. ‘అయ్యో... దొరా... నాకసలు చెప్పులే లేవు. మీకెలా ఇవ్వగలను?’ అన్నాడా కాపరి. సన్యాసి చెప్పిన మాటల వెనక ఉద్దేశం చేతనవర్మకు అప్పుడు అర్థమైంది. ‘కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకున్నా... ఆ పశువుల కాపరి ఎంతో సంతోషంగా జీవిస్తున్నాడు. దేశాన్ని ఏలే నేను అసంతృప్తిగా ఉండటం సరికాదు. ఉన్నవాటిని వదిలి లేని వాటికోసం ఆలోచించడమే విచారానికి కారణం’ అని తెలుసుకున్నాడు. అప్పటి నుంచీ ఆనందంగా జీవించసాగాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Kadapa: కడప నడిబొడ్డున ఇద్దరు యువకుల దారుణహత్య
-
World News
Miss Universe : మిస్ యూనివర్స్ పోటీలు.. నన్ను చూసి వారంతా పారిపోయారు..!
-
Movies News
Samantha: ఎంతోకాలం తర్వాత గాయని చిన్మయి గురించి సమంత ట్వీట్
-
India News
Parliament: ‘అదానీ - హిండెన్‌బర్గ్’పై చర్చకు విపక్షాల పట్టు.. పార్లమెంట్లో గందరగోళం
-
Crime News
Hyderabad: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇంట్లో భారీ చోరీ