లావా రాళ్ళు... చల్లని ఇళ్ళు!

దూరం నుంచి చూస్తే ‘బాబోయ్‌ చెదపురుగులు పెట్టిన పుట్టలు అంత పెద్దగా ఉన్నాయేంటీ’ అన్నట్టు కనిపిస్తాయి. కాస్త దగ్గరకు వెళ్లి చూశామంటే అదో ఊరనీ, అవన్నీ ....

Published : 01 May 2022 00:10 IST

లావా రాళ్ళు... చల్లని ఇళ్ళు!

దూరం నుంచి చూస్తే ‘బాబోయ్‌ చెదపురుగులు పెట్టిన పుట్టలు అంత పెద్దగా ఉన్నాయేంటీ’ అన్నట్టు కనిపిస్తాయి. కాస్త దగ్గరకు వెళ్లి చూశామంటే అదో ఊరనీ, అవన్నీ మనుషులుండే ఇళ్లనీ అర్థమవుతుంది. ఇవన్నీ ఇరాన్‌లోని ‘కండోవన్‌’ అనే ఊరి సంగతులు. అందుకే మరి ఈ బుల్లి పల్లె పర్యటకంగా ఎంతో పేరు తెచ్చుకుంది. అసలేంటీ ఇళ్ల ప్రత్యేకత అంటే... కొన్నివేల సంవత్సరాల క్రితం అగ్నిపర్వతాల నుంచి వెలువడిన లావా, బూడిద లాంటి వాటితో ఇక్కడ రాతిశిలలు ఏర్పడ్డాయట. దాదాపు 700 సంవత్సరాల క్రితం వాటిని గుహల్లా తొలుచుకుని జనావాసాలుగా మార్చుకున్నారు. రాళ్లనే ఇళ్లలా మలుచుకుని కిటికీలూ, తలుపులూ, మెట్లూ... ఇలా ఓ ఇంటికి కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసుకున్నారు. తరతరాలుగా వాటిల్లోనే హాయిగా బతికేస్తున్నారు. పైగా ఈ రాతిఇళ్లు వేసవిలో చల్లగానూ, చలికాలంలో వెచ్చగానూ ఉంటాయట. అందుకే 700 మంది జనాభాతో ఉండే ఈ ఊళ్లో కేవలం ఇళ్లే కాదు... బడీ, మసీదూ లాంటి నిర్మాణాలన్నీ కూడా ఈ రాతితోనే నిర్మించుకున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..