కేదారనాథుడికి కాపలా!

మిలమిల మెరిసే మంచు కొండల నడుమ అంతే అద్భుతంగా ఉండే కేదారనాథుడి ఆలయాన్ని చూస్తే చాలు... మనసంతా ప్రశాంతమైపోతుంది.

Published : 07 Jan 2023 23:31 IST

కేదారనాథుడికి కాపలా!

మిలమిల మెరిసే మంచు కొండల నడుమ అంతే అద్భుతంగా ఉండే కేదారనాథుడి ఆలయాన్ని చూస్తే చాలు... మనసంతా ప్రశాంతమైపోతుంది. అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భక్తులు అక్కడ శివయ్యను దర్శనం చేసుకుని వస్తుంటారు. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత పడిపోయి మంచుగడ్డలు పేరుకుపోయే అక్టోబర్‌ లేదా నవంబర్‌ నెలల్లో గుడిని మూసి వేసి ఏప్రిల్‌- మేలో తెరుస్తారు. ఒక్కసారి గుడి మూసేశాక మళ్లీ అటువైపు ఎవరూ వెళ్లరు. అత్యంత ప్రమాదకర వాతావరణ పరిస్థితులు నెలకొనే కేథారనాథుడు కొలువైన ప్రాంతాన్ని ఇప్పుడు నిత్యం 30 మంది ఐటీబీపీ అధికారులు కాపు కాస్తున్నారు. ఎందుకంటే... మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం కేదారనాథుడికి దాదాపు యాభై కేజీల బంగారాన్ని కానుకగా అందించింది. దాంతో ఆ గుడి అందాన్ని రెట్టింపు చేసేలా 550 గోల్డ్‌ షీట్స్‌ను చేయించి గర్భగుడిని అలంకరించారు. ఈ మధ్యనే ఆ పనులన్నీ పూర్తయ్యాయి. పైగా గుడి కూడా మూసి ఉండటంతో ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు ఆలయ రక్షణ బాధ్యతల్ని చేపట్టారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..