కోడికీ కట్టారో భవంతి

కోళ్లను పెంచుకునేవాళ్లు పెరట్లో గూళ్లు కట్టించడం తెలిసిందే. అయితే వాటిని ఎక్కువగా ఇటుకలతోనో లేదా మట్టితోనో నిర్మిస్తారు. కొందరైతే గంపల్నే కప్పుతారు.

Updated : 20 Nov 2022 06:40 IST

కోడికీ కట్టారో భవంతి

కోళ్లను పెంచుకునేవాళ్లు పెరట్లో గూళ్లు కట్టించడం తెలిసిందే. అయితే వాటిని ఎక్కువగా ఇటుకలతోనో లేదా మట్టితోనో నిర్మిస్తారు. కొందరైతే గంపల్నే కప్పుతారు. కానీ పాశ్చాత్య దేశాల్లో మాత్రం వాటికీ ఓ చక్కని పొదరింటినీ నిర్మిస్తారు. పైగా ఇటీవల టొరి స్పెల్లింగ్‌, జులియా రాబర్ట్స్‌, మార్తా స్టెవార్ట్‌... వంటి హాలీవుడ్‌ సెలెబ్రిటీలకు కోళ్లను పెంచుకోవడం ఓ హాబీగా మారింది. వాళ్లయితే వీటికోసం లక్షల రూపాయలు వెచ్చించి మరీ గూళ్ళు నిర్మిస్తున్నారట. అందుకేమరి... నెయ్‌మన్‌ మార్కస్‌ అనే కంపెనీ- ‘ద హెరిటేజ్‌ హెన్‌ మినీ ఫామ్‌’ పేరుతో అత్యంత విలాసవంతమైన కోళ్లగూడుని తయారుచేసింది. దీని ధర ఎనభై లక్షల రూపాయల పైచిలుకేనట. అందులో వాటికోసం ఖరీదైన ఫర్నిచర్‌తోపాటు షాండ్లియర్‌నీ ఏర్పాటుచేశారు. పైగా కోళ్లను ఎలా పెంచాలో చెప్పే పుస్తకాలతో మినీ లైబ్రరీని కూడా ఉంచారట. మొత్తమ్మీద కోళ్లను పెంచుకునేవాళ్లు అవి ఆరోగ్యంగా పెరిగేందుకూ చక్కగా ఆడుకునేందుకూ వీలుగా వాటికోసం అందమైన పొదరిళ్లను నిర్మించడం విశేషం!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..