కొండ చివర కోట... కోట చుట్టూ ఊరు!
ఎత్తయిన కొండ... దానిమీద పెద్ద కోట... ఆ కోటకు రక్షణగా- ఓ పట్టణం..! ‘కోటకు కాపలాగా సైనికులో, ఎత్తయిన గోడో ఉంటుంది కానీ పట్టణం ఉండటమేంటీ అనుకుంటున్నారా... మరదే ఇక్కడ గమ్మత్తు. ఇటలీలోని రోకా ఇంపీరియల్ అనే పట్టణాన్ని చూస్తే అలాగే అనిపిస్తుంది ఎవరికైనా. పర్వతాల నడుమ ఎత్తయిన కొండమీద ఓ పురాతన కోట ఉంటుంది. దానికి ఆనుకుని కొండ కింద భాగం వరకూ వందలాది ఇళ్లు బోలెడన్ని వరసల్లో కనిపిస్తాయి. దాదాపు నాలుగువేల జనాభాతో ఉండే ఈ ఊరు గుర్తింపు కూడా అదే. కాసింత సాహసాన్నీ, కూసింత ప్రకృతినీ ఇష్టపడేవారికి ఇదో చక్కటి సందర్శక ప్రాంతం. అందుకే అలాంటి పర్యటకులెందరో కొండపైకి ఎక్కిన ఈ ఊరును చూడ్డానికి బారులు కడుతుంటారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
పసిపాప ఆకలి తీర్చేందుకు.. 10 కిలోమీటర్ల ప్రయాణం!
-
Crime News
vizag: విశాఖ రామజోగయ్యపేటలో కూలిన మూడు అంతస్తుల భవనం.. బాలిక మృతి
-
India News
కొంగ మీది బెంగతో.. యువరైతు కంటతడి
-
Sports News
హ్యాట్రిక్ డక్.. తొలి బంతికే.. వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్
-
World News
Prince Harry: ప్రిన్స్ హ్యారీకి అమెరికా ‘బహిష్కరణ’ ముప్పు..!
-
India News
Amritpal Singh: అరెస్టైనవారికి సాయం చేస్తాం: అకాలీదళ్