Published : 04 Feb 2023 23:34 IST

సూదీ దారంతో ప్రాణం పోశారు!

పువ్వూ, దాని చుట్టూ అందమైన ఆకులూ... ఓ తీరుగా వేసిన ఎంబ్రాయిడరీని చూస్తేనే ‘అబ్బ ఎంత చక్కగా వేశావు’ అనేస్తారు. మరైతే అచ్చంగా ఫొటోల్లా కనిపిస్తున్న ఈ కుట్టుబొమ్మల్ని చూసి ఏమంటారో మీరే చెప్పండి. నిజంగానే నీటిపైన బాతు తిరుగాడుతోందా... పులి దర్జాగా కూర్చుని సేదతీరుతోందా... సింహం ఆహారం కోసం ఎదురుచూస్తోందా... అన్నట్టుగా ఎన్నెన్నో హావభావాలు పలికిస్తున్న ఈ ఫొటోలన్నీ కూడా ఎంబ్రాయిడరీతో రూపుదిద్దుకున్నవే అంటే అస్సలు నమ్మబుద్ధికావడం లేదు కదూ. కానీ అప్పుడో ఇప్పుడో కాదు... వేల ఏళ్ల నాటి నుంచీ చైనీయులు సూదీదారంతో ఇలా కళకు ప్రాణం పోస్తున్నారు. బట్టపైన ముందుగా వేయాలనుకున్న బొమ్మ ఆకారాన్ని గీసుకుని దానికి సరిపోయే రంగుల దారాలతో ఆ బొమ్మ ఆకారం వచ్చేలా కుట్టేస్తారు. పెన్సిల్‌తో ఓ జంతువు బొమ్మ గీయడమే అందరికీ చేతకాదు, అలాంటిది దారంతో ఆ రూపాన్నీ, చుట్టూ పరిసరాల్నీ కుట్టడం అంటే మాటలా... అందుకే మరి ఈ రియలిస్టిక్‌ ఎంబ్రాయిడరీ బొమ్మల్ని చూసినవారంతా ‘ఏం కళరా బాబూ’ అంటూ నోరెళ్లబెడుతున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..