రామకథను కనరయ్యా!

శ్రీరాముడి జననం నుంచి రావణ సంహారం వరకూ రామాయణగాథలో జరిగిన ఘట్టాల గురించి వినే ఉంటారుగా. మలేషియాలోని కౌలాలంపూర్‌కి వెళితే ఆ సన్నివేశాల్ని కళ్లకు కట్టినట్లుగా చూడొచ్చు.

Published : 25 Mar 2023 23:40 IST

రామకథను కనరయ్యా!

శ్రీరాముడి జననం నుంచి రావణ సంహారం వరకూ రామాయణగాథలో జరిగిన ఘట్టాల గురించి వినే ఉంటారుగా. మలేషియాలోని కౌలాలంపూర్‌కి వెళితే ఆ సన్నివేశాల్ని కళ్లకు కట్టినట్లుగా చూడొచ్చు. వేల ఏళ్లనాటి ప్రఖ్యాత బటు గుహల పక్కనే రామాయణ కేవ్‌ ఉంది. దీంట్లో బాలరాముడి నుంచి సీతారాముడి వరకూ ఎన్నెన్నో శిల్పాలుంటాయి. ఈ గుహ ముందు అడుగుపెట్టగానే యాభై అడుగుల ఎత్తుతో హనుమంతుడి విగ్రహం దర్శనమిస్తుంది. సున్నపురాయితో సహజసిద్ధంగా ఏర్పడిన విశాలమైన ఈ గుహలోపల- దేవాలయాలతో పాటూ వాల్మీకి రామాయణ కథ మొదలుపెట్టిన ఘట్టం నుంచి రామాయణ ఇతిహాసం ముగిసేవరకూ ఎన్నో సన్నివేశాలు ఉంటాయి. ఆయా పాత్రలన్నీ పెద్ద పెద్ద విగ్రహాలుగా ఎంతో అందంగా కనిపిస్తాయి. వందలాది విగ్రహాలతో కథ అంతా కళ్లకు కనిపిస్తుంది. గుహ లోపల రంగుల లైటింగ్‌ ప్రదర్శనల మధ్య ఉన్న ఈ శిల్పకథను చూడ్డానికి సందర్శకులు బారులు కడుతుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..