చిక్కుడుకాయలతో... చవులూరించేలా!
ఏదయినా కూరను ఒకే రుచిలో చేయాలన్నా...
తినాలన్నా విసుగే. చిక్కుడుకాయలకీ ఇది వర్తిస్తుంది కాబట్టి...
వాటిని ఎప్పుడూ టొమాటోలతో కలిపి కాకుండా ఇలా వండి చూడండోసారి. అన్నంతోపాటు, రోటీల్లోకీ బాగుంటాయి.
వంకాయ చిక్కుడుకాయ కూర
కావలసినవి: చిక్కుడుకాయలు: పావుకేజీ, వంకాయలు: పావుకేజీ, కరివేపాకు రెబ్బలు: మూడు, సెనగపప్పు: చెంచా, ఎండుమిర్చి: రెండు, మినప్పప్పు: చెంచా, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, పసుపు: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: పావుకప్పు, పచ్చిమిర్చి: ఆరు, అల్లం తరుగు: రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు: పావుకప్పు.
తయారీ విధానం: వంకాయల్ని ముక్కల్లా కోసి ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి. చిక్కుడుకాయల్ని ఒలిచి కాస్త పెద్ద ముక్కల్లా కోసుకోవాలి. స్టౌమీద కడాయిని పెట్టి నూనె వేసి సెనగపప్పు, ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు వేయించుకోవాలి. తరువాత కరివేపాకు, వంకాయ ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు, పసుపు వేసి కాసిని నీళ్లు చల్లి మూత పెట్టాలి. అయిదు నిమిషాలయ్యాక తగినంత ఉప్పు వేసి కలిపి స్టౌని సిమ్‌లో పెట్టాలి. ఈ కూరముక్కలన్నీ బాగా మగ్గాక అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్రను మిక్సీలో మెత్తగా చేసుకుని కూరలో వేసి బాగా కలిపి... అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.
కూటు
కావలసినవి: సన్నగా తరిగిన చిక్కుడుకాయ ముక్కలు: కప్పు, పెసరపప్పు: అరకప్పు, పసుపు: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు: చెంచా, సెనగపప్పు: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, ఇంగువ: పావుచెంచా, మినప్పప్పు: టేబుల్‌స్పూను, ఎండుమిర్చి: మూడు, మిరియాలు: అరచెంచా,
జీలకర్ర: చెంచా, దనియాలు: చెంచా, కొబ్బరితురుము: పావుకప్పు.
తయారీ విధానం: ముందుగా మినప్పప్పు, ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, దనియాలు, కొబ్బరితురుమును మిక్సీలో తీసుకుని పావుకప్పు నీళ్లతో పేస్టులా చేసుకోవాలి. కుక్కర్‌లో కడిగిన పెసరపప్పు, చిక్కుడుకాయ ముక్కలు, పసుపు, సరిపడా నీళ్లు పోసి స్టౌమీద పెట్టి... మూడు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని దింపేయాలి. ఇప్పుడు స్టౌమీద కడాయిని పెట్టి నూనె వేసి... ఆవాలు, సెనగపప్పు వేయించుకుని కరివేపాకు, ఇంగువ వేయాలి. తరవాత చేసిపెట్టుకున్న మసాలా, ఉడికించుకున్న పప్పు, తగినంత ఉప్పు, పావుకప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ పప్పు చిక్కగా అవుతున్నప్పుడు దింపేయాలి.
మసాలా కూర
కావలసినవి: చిక్కుడుకాయ ముక్కలు: ఒకటిన్నర కప్పు, పల్లీలు: రెండు టేబుల్‌స్పూన్లు, దాల్చినచెక్క: చిన్నముక్క, దనియాలు: రెండు చెంచాలు, జీలకర్ర: చెంచా, లవంగాలు: నాలుగు, యాలకులు: రెండు, ఎండుకొబ్బరిపొడి: పావుకప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, చిక్కని చింతపండు రసం: పావుకప్పు, ఉప్పు: తగినంత, కారం: రెండు పెద్ద చెంచాలు, నూనె: పావుకప్పు, ఆవాలు: చెంచా, పచ్చిమిర్చి: రెండు, ఉల్లిపాయముక్కలు: పావుకప్పు, పసుపు: అరచెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, టొమాటోముక్కలు: అరకప్పు, కసూరీమేథీ: చెంచా.
తయారీ విధానం: స్టౌమీద కడాయిని పెట్టి పల్లీల్ని వేయించి తీసుకోవాలి. అదే కడాయిలో దాల్చినచెక్క, దనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకుల్ని వేయించుకుని స్టౌ కట్టేయాలి. ఈ మసాలా దినుసులు, పల్లీలు, అల్లంవెల్లుల్లిముద్ద, చింతపండురసం, కొబ్బరిపొడి, తగినంత ఉప్పు, కారం మిక్సీలో వేసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయిని పెట్టి నూనె వేసి ఆవాల్ని వేయించాలి. తరవాత పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇందులో పసుపు, టొమాటోముక్కలు, చేసిపెట్టుకున్న మసాలా, చిక్కుడుకాయ ముక్కలు, కసూరీమేథీ వేసి బాగా కలిపి ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. ఈ కూర ఉడికి దగ్గరకు అయ్యాక దింపేయాలి.
పొడికూర
కావలసినవి: చిక్కుడుకాయలు: పావుకేజీ, ఎండుమిర్చి: ఆరు, పుట్నాలపప్పు: మూడు టేబుల్‌స్పూన్లు, వేయించిన నువ్వులు: రెండు చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు: ఎనిమిది, నూనె: పావుకప్పు, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, ఉప్పు: తగినంత, పసుపు: పావుచెంచా.
తయారీ విధానం: ముందుగా ఎండుమిర్చి, పుట్నాలపప్పు, నువ్వులు, వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీలో తీసుకుని పొడిలా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయించుకుని... అందులో చిక్కుడుకాయ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ఆ ముక్కలు మెత్తగా అయ్యాక చేసిపెట్టుకున్న మసాలాపొడిని వేసి బాగా కలిపి... కూర పొడిపొడిగా అయ్యాక దింపేయాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
World News
America: ‘ఆయుధాలు ఇచ్చి ఆహారధాన్యాలు తీసుకో’.. రష్యా తీరుపై అమెరికా ఆందోళన..!
-
India News
Chandigarh University: పరీక్షలో పాటలే సమాధానాలు.. లెక్చరర్ కామెంట్‌కు నవ్వులే నవ్వులు
-
India News
Plant Fungi: మనిషికి సోకిన ‘వృక్ష శీలింధ్రం’.. ప్రపంచంలోనే తొలి కేసు భారత్‌లో!
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
-
Movies News
Aditya Om: ఇంకా బతికే ఉన్నారా? అని కామెంట్ చేసేవారు: ఆదిత్య ఓం
-
Politics News
Yediyurappa: వరుణ నుంచి కాదు.. నా సీటు నుంచే విజయేంద్ర పోటీ: యడియూరప్ప క్లారిటీ!