Updated : 19 Mar 2023 04:40 IST

సిల్లీపాయింట్‌

కప్పుడు తెలుగు సహా భారతీయ భాషలు దేంట్లోనూ... పదాల మధ్య ఖాళీలు వదిలి రాసే పద్ధతి లేదు! వ్యాకరణ జ్ఞానాన్ని బట్టి మనమే విభజించి చదువుకోవాలి. 1850 తర్వాత అచ్చు యంత్రాలు పెరిగాకే ఇంగ్లిషులో ఉన్నట్టు ఇక్కడా ఖాళీ విడిచి రాయడం మొదలైంది!

* మనమైతే వారానికి ఒకసారో రెండుసార్లో... తలస్నానం చేస్తుంటాం. కానీ బ్రెజిల్‌ ప్రజలు రోజుకి రెండుసార్లు తలస్నానం చేస్తారు. అక్కడా వేడి ఎక్కువ కావడమే ఇందుక్కారణమట!

* లాటిన్‌ భాషలో ‘టబుల’ అంటే పలక అని. ఇప్పుడు మనం వాడుతున్న టాబ్లెట్‌(ట్యాబ్‌) ఆ పదం నుంచి వచ్చిందే!

* ఐస్‌ల్యాండ్‌ దేశంలోని రైళ్లలో ప్రయాణికులు ఎక్కడానికి వీల్లేదు. అక్కడి ప్రతిరైలూ సరకు రవాణాకే పరిమితం!

* మూకీ సినిమాల కాలంలో... పాటలు ఉండేవి కాదు కదా! అందుకని, సినిమా ప్రదర్శనని అక్కడక్కడా ఆపి... లైవ్‌ నాట్యకార్యక్రమాలూ, హాస్య నాటికలూ వేసేవారు! టాకీలొచ్చాక ఆ డ్యాన్సులూ, హాస్య నాటకాలే సినిమాలోకి వెళ్ళిపోయి... నేటి వరకూ కొనసాగుతున్నాయి!

* మగవారిలో బట్టతల మొదలయ్యేకొద్దీ... గెడ్డం పెరగడంలోని వేగం ఎక్కువవుతుంది. తలపైన వెంట్రుకలు ఊడిపోవడానికి కారణమయ్యే డిహైడ్రోటెస్టోస్టిరాన్‌ (డీహెచ్‌టీ) హార్మోనే ఇందుకూ కారణమవుతుందట!

* కంబోడియా, థాయ్‌లాండ్‌, లావోస్‌లలో... ఫోర్క్స్‌తో తినకూడదు. ప్లేట్‌లో ఉన్న ఆహారపదార్థాల్ని కట్‌చేయడానికి మాత్రమే వాటిని వాడతారు, స్పూన్‌తో మాత్రమే తింటారు.


* ముళ్ళపందికి శత్రు ప్రమాదం పొంచి ఉందని తెలియగానే ముళ్ళు నిక్కబొడుచుకుంటాయి! ఒకప్పుడు కోతులకీ... ఆదిమమానవులకీ కూడా ఈ లక్షణం ఉండేదట. పరిణామక్రమంలో అది తగ్గినా... ఇంకా పూర్తిగా పోలేదు. ఆనందమో భయమో కలిగినప్పుడు మన శరీరంలో ఏర్పడే ‘గగుర్పాటు’ ఆ పాతలక్షణానికి ఆనవాలు మరి!

సిగరెట్‌ని...క్యాన్సర్‌ స్టిక్‌, కఫిన్‌ నెయిల్స్‌ (శవపేటిక మేకులు) అనీ పిలుస్తుంటారు అమెరికాలో!


ఉప్పునీటి రొయ్యల్లో ‘కాంతాజాంతిన్‌’ అనే ఎర్రటి పిగ్మెంట్‌ ఉంటుంది. వాటిని తినడం వల్లే ఫ్లెమింగో పక్షులు ఎర్రగవుతాయట!


కనిపించిన ప్రతి వాక్యంలోనూ వ్యాకరణ దోషాలని వెతకడాన్ని ‘గ్రామర్‌ పెడంటరీ సిండ్రోమ్‌’ (జీపీఎస్‌) అంటారు. ఇది కూడా ఓ మానసిక సమస్యేనంటోంది సైకాలజీ!


ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌ నగరంలో సెన్‌ అనే నది ప్రవహిస్తుంటుంది. ఈ నదికి కుడివైపున ఉన్న రోడ్డుని వేసవి వస్తే చాలు, ఇసుకతో కప్పేస్తారు. ఎందుకూ అంటారేమో... ప్యారిస్‌కి దగ్గర్లో సముద్రం లేకపోవడం వల్ల ప్యారిస్‌ వాసులు దాన్నే బీచ్‌గా భావించి అక్కడ సేదతీరుతారట!


మెడ భాగం కాస్త పెద్దగా ఉండటం వల్ల... జిరాఫీలు పరస్పరం మాట్లాడుకోవేమోనని నిన్నమొన్నటిదాకా అనుకుంటూ వచ్చారు శాస్త్రవేత్తలు! కానీ, మనిషి చెవులు అందుకోలేని అతితక్కువ శబ్దంతో అవి పాటలు కూడా పాడుకుంటాయని తేల్చాయి తాజా పరిశోధనలు!


మరాఠీలు బొట్టుని ఎక్కువగా నెలవంక ఆకారంలోనే దిద్దుకుంటారు. ఈ సంప్రదాయ బొట్టుని... చంద్రకోర్‌ అంటారక్కడ!


జర్మనీలోని హెస్‌ నగరంలో ఓ ప్రొటెస్టెంట్‌ చర్చ్‌ ఉంది. ఇక్కడ పాస్టర్‌ బదులు... ఓ రోబోనే భక్తులకి ఆశీస్సులందిస్తుంది. ఏడు భాషల్లో బైబిల్‌ వచనాలని చెప్పి మరీ శుభాశీస్సులు అందజేస్తుందట.


మందుబిళ్లల మధ్యలో ఉండే గీతని ‘స్కోర్‌’ అంటారు!


ఫేస్‌బుక్‌లో ఐదుశాతం (దాదాపు తొమ్మిదికోట్ల) ఖాతాలు నకిలీవే ఉంటున్నాయని చెబుతోంది... దాని మాతృసంస్థ మెటా!


ఇడ్లీ, దోశ, వడ, పిజ్జా... ఇప్పుడు దాదాపు ప్రతి ఆహారపదార్థానికీ రెడీమేడ్‌ మిక్స్‌ వస్తున్నాయి కదా! ఈ ట్రెండు 1889లో... ‘ప్యాన్‌కేక్‌’తోనే మొదలైందట.


ర్మనీలో విద్యార్థులు ఆరో తరగతి దాకా... ఫౌంటెన్‌ పెన్నులు మాత్రమే వాడాలనే రూలుంది. ఆ పెన్నుల తోనే అందంగా రాయడం అలవాటవుతుందని అక్కడ నమ్మకమట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు