‘ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్‌’.. కలిసుంటారు కాపురం చేయరు!

వివాహబంధంలోకి అడుగు పెట్టిన వాళ్లెవరైనా దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తూ.. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. జపాన్‌లో మాత్రం అలాంటి వాటికి తావులేకుండా కేవలం పెళ్లయిందని చెప్పుకోవడానికి మాత్రమే ఆ బంధాన్ని కోరుకుంటున్నారు.

Updated : 23 Jun 2024 11:21 IST

వివాహబంధంలోకి అడుగు పెట్టిన వాళ్లెవరైనా దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తూ.. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. జపాన్‌లో మాత్రం అలాంటి వాటికి తావులేకుండా కేవలం పెళ్లయిందని చెప్పుకోవడానికి మాత్రమే ఆ బంధాన్ని కోరుకుంటున్నారు. ‘ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్‌’ పేరిట కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ఆ జంటలు- ప్రేమ, లైంగిక సంబంధానికి తావులేకుండా జీవిస్తున్నారు. పరస్పర ఆసక్తులను గౌరవించుకుంటూ స్నేహితులుగా మెలుగుతూ అన్ని పనులూ పంచుకుంటారు. పిల్లలు కావాలనుకుంటే కృత్రిమ గర్భదారణ పద్ధతులను ఎంచుకుంటారు- కలిసే బిడ్డను పెంచుతారు. ‘అంత మాత్రానికి పెళ్లెందుకు? సహజీవనం చేస్తే సరిపోతుంది కదా’ అనుకోవచ్చు. కానీ జపాన్‌లో చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నవారికి పలు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి. వృత్తి జీవితంలో సవాళ్లను ఎదుర్కొనే ఎంతోమంది- అటు తమ వ్యక్తిగత జీవితం నచ్చినట్టు ఉండాలనీ, ఇటు ప్రభుత్వ పథకాలను వదులుకోకూడనీ భావించి ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్‌లు చేసుకుంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..