పిల్లలు మెచ్చే పుస్తకాల అరలు

పిల్లలకు సంబంధించిన వస్తువు ఏదైనా కానీ... అది కచ్చితంగా వారిని ఆకట్టుకునేలా ఉండితీరాలంతే. అందుకే మరి, పుస్తకాల బ్యాగు నుంచి పెన్నుల బాక్సు వరకూ ప్రతిదీ పిల్లలు మెచ్చే మోడళ్లలోనే వస్తున్నాయి.

Published : 21 Jan 2023 23:58 IST

పిల్లలు మెచ్చే పుస్తకాల అరలు

పిల్లలకు సంబంధించిన వస్తువు ఏదైనా కానీ... అది కచ్చితంగా వారిని ఆకట్టుకునేలా ఉండితీరాలంతే. అందుకే మరి, పుస్తకాల బ్యాగు నుంచి పెన్నుల బాక్సు వరకూ ప్రతిదీ పిల్లలు మెచ్చే మోడళ్లలోనే వస్తున్నాయి. ఇప్పుడు అదే తరహాలో ‘కిడ్స్‌ బుక్‌ షెల్ఫ్‌’ కూడా వచ్చేసింది. కారూ, జీపూ, చెట్టూ, ఇల్లూ... ఇలా చిన్నారులకిష్టమైన బొమ్మల రూపాల్లో ఈ పుస్తకాల అరలు అందుబాటులో ఉన్నాయి. గదిలో గోడ పక్కన పెట్టుకునేలా ఉండే ఈ అరల్లో పుస్తకాలూ, బొమ్మల్లాంటివి దేనికది సర్దుకునేలా విడివిడిగా బోలెడన్ని అరలు ఉంటాయి. అవసరమైతే అక్కడే కూర్చుని హోంవర్క్‌లాంటివి రాసుకునేలా ప్రత్యేకంగా కుర్చీలాంటి ఏర్పాటూ ఉంటుంది. ఇలా రెడీమేడ్‌గా దొరుకుతున్నవే కాకుండా కావాలంటే మీ బుజ్జాయిల గదికి సరిపోయే పుస్తకాల అల్మారానీ ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకోవచ్చు కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..