అందంగా రాసేద్దాం!

ఏదైనా గ్రీటింగ్‌ కార్డు మీదో, బహుమతి పైనో చక్కటి అక్షరాలతో రాస్తూ ప్రియమైన వారికి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటాం.

Published : 21 Jan 2023 23:59 IST

అందంగా రాసేద్దాం!

ఏదైనా గ్రీటింగ్‌ కార్డు మీదో, బహుమతి పైనో చక్కటి అక్షరాలతో రాస్తూ ప్రియమైన వారికి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటాం. చూడగానే అవతలి వారిని ఆ అక్షరాలు ఆకట్టుకునేలా ఉండటానికి రంగుల పెన్నుల్నీ, మెరుపుల మార్కర్లనీ ఉపయోగిస్తుంటాం. కానీ ఇప్పుడు అలా రెండుమూడు పెన్నులూ, మార్కర్లూ వాడకుండానే ‘సెల్ఫ్‌ ఔట్‌ లైన్‌ మెటాలిక్‌ మార్కర్‌’తో ఆ అందం తెప్పించేయొచ్చు. అక్షరాల్ని అటు మెరిపిస్తూనే ఇటు వాటికి రంగుల ఔట్‌ లైన్‌ ఇచ్చేయొచ్చు. దీంతో పేపర్‌పైన ఏదైనా రాశామంటే మధ్యలో గ్లిటర్‌ మెరుపులతో పాటూ అంచుల్లో రంగులూ వస్తాయి. రాసిన అక్షరాల చుట్టూ ప్రత్యేకంగా లైన్‌ వేయడానికి పెద్దగా ఇబ్బంది పడకుండానే దీంతో క్షణాల్లో రాసేయొచ్చు. ఆలస్యం చేయకుండా ఈసారి ఏ సందర్భానికైనా శుభాకాంక్షల్ని చెప్పే గ్రీటింగ్‌కార్డు మీద ఈ పెన్నుతో రాసి చూడండి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..