ఎన్నిసార్లైనా రంగులేసుకోవచ్చు!

అప్పుడప్పుడే పెన్సిల్‌ పట్టుకున్న చిన్నారులకు రంగులేయడమంటే భలే సరదాగా ఉంటుంది.

Published : 22 Jan 2023 00:01 IST

ఎన్నిసార్లైనా రంగులేసుకోవచ్చు!

ప్పుడప్పుడే పెన్సిల్‌ పట్టుకున్న చిన్నారులకు రంగులేయడమంటే భలే సరదాగా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకునే అమ్మానాన్నలు పుస్తకాల్లో వచ్చిన బొమ్మలే కాకుండా బుజ్జాయిల కోసం విడిగా రంగుల పేపర్లనూ కొంటుంటారు. కానీ ఇప్పుడు అలా పదుల సంఖ్యలో కలరింగ్‌ పేపర్లను కొనక్కర్లేదు. ‘ఆల్‌ ఇన్‌ వన్‌ ప్యాక్‌ కలరింగ్‌ రోల్‌, రీయూజబుల్‌ కలరింగ్‌ రోల్‌’ పేర్లతో సరికొత్త రంగులేసుకునే రోల్స్‌ దొరుకుతున్నాయి. రకరకాల సైజుల్లో దొరికే ఈ కలరింగ్‌ రోల్స్‌పైన ఎంచక్కా రంగులేసుకోవచ్చు. వీటి ప్రత్యేకత ఏంటంటే... ఆ రంగుల్ని తుడిచేసి మళ్లీ మళ్లీ రంగులేసుకోవచ్చు. స్కెచ్‌ పెన్నులతో రంగులు వేస్తే తడి క్లాత్‌తో, క్రేయాన్స్‌తో రంగులు అద్దితే రబ్బరుతో తుడిస్తే చాలు. మళ్లీ ఎప్పటిలా తెల్ల కాగితంలా మారిపోతుంది. వీటిల్లో పుస్తకం మీద పెట్టుకునే రోల్స్‌ నుంచి గోడకు అతికించుకుని రంగులు వేసుకునే రోల్స్‌ వరకూ చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..