చిట్టి చెప్పులకు కొత్త లుక్కు!

టింకూ ఎప్పుడూ వేసుకునే క్రాక్‌ షూ బోర్‌ కొట్టేశాయంటూ పక్కనపెట్టేశాడు. కానీ వాళ్ల అమ్మ వాటినే నిమిషాల్లో సరికొత్తగా మార్చేసి టింకూ ముందు ఉంచింది.

Published : 22 Jan 2023 00:03 IST

చిట్టి చెప్పులకు కొత్త లుక్కు!

టింకూ ఎప్పుడూ వేసుకునే క్రాక్‌ షూ బోర్‌ కొట్టేశాయంటూ పక్కనపెట్టేశాడు. కానీ వాళ్ల అమ్మ వాటినే నిమిషాల్లో సరికొత్తగా మార్చేసి టింకూ ముందు ఉంచింది. ఎలాగంటారా... ‘క్రియేటివ్‌ కార్టూన్‌ షూ యాక్సెసరీస్‌, క్రాక్‌ చార్మ్స్‌, చైన్స్‌’ పేర్లతో వచ్చిన చెప్పులకు కొత్త లుక్కు ఇచ్చే అలంకరణ వస్తువులతో. వీటిల్లో బోలెడన్ని రంగుల కార్టూన్‌ బొమ్మలూ... పూలూ... ముత్యాలూ, రాళ్లతో ఉన్న చార్మ్స్‌... అక్షరాలతో ఉన్న పేర్లూ... గొలుసులూ... మార్కెట్లో ఎన్నెన్నో దొరుకుతున్నాయి. కావాల్సినవి కొనుక్కుని పిల్లల చెప్పుల్ని మరింత అందంగా డెకరేట్‌ చేయొచ్చు. చూడ్డానికి చిన్న చిన్న అలంకరణ వస్తువులే అయినా పాత బూట్లని సరికొత్తగా చూపిస్తాయంటే నమ్మండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..