Published : 29 Jan 2023 01:02 IST

గుండీ పట్టకపోతే...

కొన్ని చొక్కాలూ, ప్యాంట్లూ అంతా బాగున్నా కూడా గుండీలు పెట్టుకునే దగ్గర మాత్రం కాస్త బిగుతుగా అనిపిస్తాయని వాటిని పక్కన పెట్టేస్తుంటాం. కానీ ఒక చిన్న వస్తువుతో వాటికి చక్కటి పరిష్కారం చూపొచ్చు. చొక్కాలకూ, ప్యాంట్లకూ సరిపోయేలా రకరకాల మోడళ్లలో బటన్‌ ఎక్స్‌టెండర్లు దొరుకుతున్నాయి. వీటిల్లో గుండీకి స్ప్రింగ్‌ లాంటిదో, క్లాత్‌ ముక్కనో ఉంటుంది. బిగుతుగా ఉన్న గుండీ దగ్గర (ఫొటోలో చూపిస్తున్నట్టుగా) బటన్‌ ఎక్స్‌టెండర్‌ను తగిలించుకోవచ్చు. ఇంకేముంది, స్ప్రింగ్‌ సాగడం వల్ల గుండీ దగ్గర కాస్త వదులుగా అవుతుంది. నిజానికి కొంచెమే బిగుతుగా ఉన్నా ఆ డ్రెస్సుతో అలా రోజంతా ఉండలేం కాబట్టి దాన్ని వేసుకోవాలంటే ఇష్టపడం. ఈ బటన్స్‌ వల్ల ఇక ఆ సమస్యే ఉండదు మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..