ఫోన్‌కూ స్పీకర్‌ పెట్టొచ్చు!

టీవీలోనే ఎంచక్కా థియేటర్‌ ఫీల్‌ శబ్దం రావడానికి చాలామంది టీవీకి విడిగా సౌండ్‌బార్‌ లాంటివి పెట్టుకుంటారు.

Published : 29 Jan 2023 01:16 IST

ఫోన్‌కూ స్పీకర్‌ పెట్టొచ్చు!

టీవీలోనే ఎంచక్కా థియేటర్‌ ఫీల్‌ శబ్దం రావడానికి చాలామంది టీవీకి విడిగా సౌండ్‌బార్‌ లాంటివి పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు అలాంటి విడి స్పీకర్‌ ఫోన్లకూ దొరుకుతోంది. బ్లూటూత్‌తో కనెక్ట్‌ చేసుకునేలా ఉండే ఈ స్పీకర్‌ని ఎక్కడికైనా సులువుగా పట్టుకెళ్లొచ్చు కూడా. విహార యాత్రల్లోనో, ఫంక్షన్లలోనో సరదాగా నలుగురితో కలిసి ధూంధాం చేయాలనుకున్నప్పుడు మనకు అందుబాటులో ఉన్న ఫోన్‌నే వాడుకోవచ్చు. ఈ బుల్లి స్పీకర్‌ పిన్నును అలా ఫోన్‌కు పెట్టామంటే చాలు...పెద్ద శబ్దంతో అందరికీ పాటలు వినిపిస్తాయి. కావాలంటే దీన్ని టీవీ, కంప్యూటర్‌, ట్యాబ్‌లాంటి వాటికీ కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఈ చిట్టిపొట్టి స్పీకర్లు బొమ్మల రూపాల్లోనూ అందుబాటులో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..