సరికొత్తగా సాధన

పిల్లలకు వేసవి సెలవులు వచ్చేశాయి. పుస్తకాలకు దూరంగా డిజిటల్‌ తెరలకూ, ఆటలకూ దగ్గరగా గడిపేస్తుంటారు.

Updated : 21 May 2023 04:10 IST

పిల్లలకు వేసవి సెలవులు వచ్చేశాయి. పుస్తకాలకు దూరంగా డిజిటల్‌ తెరలకూ, ఆటలకూ దగ్గరగా గడిపేస్తుంటారు. మరి పుస్తకాలను పూర్తిగా పక్కన పెట్టేస్తే ఎలా? అలాగని వారిని చదివిందే చదవమని చెప్పడం కూడా సరికాదు. మరి అలాంటి చిన్నారులు మీ ఇంట్లో ఉంటే ఈ డిజిటల్‌ టీచింగ్‌ స్టాంప్స్‌ని తెచ్చేసి సరికొత్తగా లెక్కలు చేయించండి. ఈ స్టాంప్‌లో ఇంకు నింపేసి పేపరు మీద నొక్కుతూ వెళితే...  కూడికలూ, తీసివేతలూ ప్రింట్‌ అవుతాయి. వాటితో పిల్లలకు లెక్కలు నేర్పించొచ్చు. స్టాంప్‌లో నంబర్లు- కూడిక, తీసివేత గుర్తులను మార్చుకునే వెసులుబాటుంది. పిల్లల చేత స్టాంప్‌తో ప్రింటు వేయిస్తే వారికి ఆసక్తిగా ఉంటుంది. లెక్కలు నేర్చుకోవడానికీ ఉత్సాహం చూపిస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు