బల్బే కెమెరాగా!

ఈ రోజుల్లో ఇంటికి అవసరమైన చాలా వస్తువుల్ని బహుళ ప్రయోజనాలు అందించే విధంగా తయారుచేస్తున్నారు.

Updated : 04 Jun 2023 04:13 IST

ఈ రోజుల్లో ఇంటికి అవసరమైన చాలా వస్తువుల్ని బహుళ ప్రయోజనాలు అందించే విధంగా తయారుచేస్తున్నారు. ఆ కోవలోకే వస్తుందీ ‘వైఫై బల్బు కెమెరా’. ఇది చూడ్డానికి సాధారణ బల్బులానే ఉన్నా ఇందులో ప్రత్యేకంగా కెమెరా, మైక్రోఫోన్‌, స్పీకర్‌ కూడా అమర్చి ఉంటాయి. 360 డిగ్రీల్లో పనిచేసే ఈ బల్బు కెమెరా ఫోనుతో అనుసంధానమై ఉంటుంది. అంటే... ఎప్పటికప్పుడు లైటును వేసుకోవడం, ఆ వెలుతురుని పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం... వంటివన్నీ ఫోనుతో చేస్తూనే ఎక్కడున్నా ఇంటినీ గమనించుకోవచ్చు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో పిల్లల్ని కొన్ని గంటలపాటు ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ బల్బు కెమెరా ద్వారా వాళ్ల కదలికల్ని ఫోనులో చూసుకుంటూనే... అవసరం అనుకున్నప్పుడు వాళ్లతో మాట్లాడొచ్చు కూడా. బాగుంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..