బకెట్‌ను మడిచేయొచ్చు

రెండు లేదా మూడు రోజులు కారులో ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు అవసరాలకు తగినట్లుగా కొన్నివస్తువుల్ని కూడా సర్దుకుంటాం.

Updated : 04 Jun 2023 04:11 IST

రెండు లేదా మూడు రోజులు కారులో ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు అవసరాలకు తగినట్లుగా కొన్నివస్తువుల్ని కూడా సర్దుకుంటాం. అవన్నీ సరే... మరి బకెట్‌ లాంటిది తీసుకెళ్లాలనుకున్నప్పుడు కారులో దానికంటూ కాస్త చోటు పెట్టుకోవాలి లేదా ఇతర వస్తువుల్ని తగ్గించుకోవాల్సి రావొచ్చు. కానీ ఇప్పుడొస్తున్న ‘పోర్టబుల్‌ ఫోల్డింగ్‌ బకెట్‌’తో ఆ సమస్య ఏమీ ఉండదు. ఎందుకంటే... మన పని అయిపోయాక దీన్ని పూర్తిగా మడిచేస్తే చాలు చిన్న చక్రం ఆకారంలోకి మారిపోతుంది. దీన్ని పూర్తిగా వాటర్‌ ప్రూఫ్‌ మెటీరియల్‌తో తయారుచేయడం వల్ల నీళ్లు కారిపోతాయనే కంగారూ అక్కర్లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు