హెల్మెట్టు... అవసరానికి తగ్గట్టు!

హెల్మెట్‌ అనగానే... బైక్‌ మీద వెళుతున్నప్పుడు రక్షణ కోసం పెట్టుకోవాల్సిన వస్తువే కదా అనుకుంటాం. కానీ వీటిల్లోనూ బోలెడన్ని రకాలున్నాయి.

Published : 07 Jul 2024 00:01 IST

హెల్మెట్‌ అనగానే... బైక్‌ మీద వెళుతున్నప్పుడు రక్షణ కోసం పెట్టుకోవాల్సిన వస్తువే కదా అనుకుంటాం. కానీ వీటిల్లోనూ బోలెడన్ని రకాలున్నాయి. అందులో వర్షాకాలంలో ఉపయోగపడేది ‘ఎలక్ట్రిక్‌ వైపర్‌ మోటర్‌సైకిల్‌ హెల్మెట్‌’. ఈ రీఛార్జబుల్‌ హెల్మెట్‌ని పెట్టుకుని వర్షంలో వెళ్లినా కంగారుపడక్కర్లేదు. ఎందుకంటే దాని మీదున్న చిన్న బటన్‌ నొక్కగానే, వైపర్‌- అద్దంపైన పడిన నీటిని చక్కగా శుభ్రం చేస్తుంది. కావాలంటే అవసరమైనప్పుడు మాత్రమే వైపర్‌ సెటప్‌ను ఉంచుకుని మామూలు సమయాల్లో తొలగించుకోవచ్చు. అంతేకాదు, ఇటాలియన్‌ మోటర్‌సైకిల్‌ హెల్మెట్‌ కంపెనీ ఎయిరో పేరుతో ఎయిర్‌బ్యాగ్‌ హెల్మెట్‌ను తయారుచేసింది. ప్రమాదాలు జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకునేలా ఉంటుందిది. ఇంకా రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం వల్ల నగరాల్లో వాతావరణం పూర్తిగా మారిపోతుంది కదా. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్యూరిఫికేషన్‌ సిస్టమ్‌తో మన దగ్గరా రకరకాల స్టార్టప్‌ కంపెనీలు ‘యాంటీ పొల్యూషన్‌ హెల్మెట్‌’లను తీసుకొస్తున్నాయి. ఏది ఏమైనా, రక్షణతోపాటు అదనపు ఉపయోగమూ ఉన్న ఈ వెరైటీ హెల్మెట్లు భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..