చొక్కా పాడవ్వదిక!

చొక్కాలకు కాలర్‌ దగ్గర ఎక్కువగా మురికిపడుతుంది. అది తెల్లటి చొక్కా అయితే దాన్ని శుభ్రం చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది.

Published : 07 Jul 2024 00:04 IST

చొక్కాలకు కాలర్‌ దగ్గర ఎక్కువగా మురికిపడుతుంది. అది తెల్లటి చొక్కా అయితే దాన్ని శుభ్రం చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఉతకడానికి తగిన జాగ్రత్తలు తీసుకునే కన్నా అసలు మురికి పట్టకుండా చూసుకుంటే మంచిది కదా. ఆ వెసులుబాటును తీసుకొచ్చింది ‘కాలర్‌ ప్రొటెక్టర్‌’. ఫ్యాబ్రిక్‌తో తయారుచేసిన ఈ కాలర్‌ ప్రొటెక్టర్‌- ప్యాడ్స్‌లా, రోల్స్‌లా దొరుకుతోంది. కాలర్లతోపాటూ చొక్కా హ్యాండ్స్‌ దగ్గరా అవసరమైనంత మేరకు అతికించు కోవచ్చు. దుస్తులు శుభ్రం చేసేప్పుడు ఆ పట్టీని తీసేస్తే సరిపోతుంది. అది ఉంచిన చోట ఎలాంటి మరకలూ పడవు. పిల్లల తెల్లటి స్కూలు చొక్కాలకైతే ఇది సరిగ్గా సరిపోతుంది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..