వేడి గిన్నెలు కాలకుండా...

పదార్థాలు వేడి చేయడానికీ, కొన్ని రకాల వేపుళ్లలాంటివి వండుకోవడానికీ చాలామంది మైక్రో అవెన్లను వాడుతుంటారు.

Published : 07 Jul 2024 00:05 IST

దార్థాలు వేడి చేయడానికీ, కొన్ని రకాల వేపుళ్లలాంటివి వండుకోవడానికీ చాలామంది మైక్రో అవెన్లను వాడుతుంటారు. ఆ గిన్నెల్ని లోపల పెట్టేప్పుడు పర్వాలేదుకానీ వేడయ్యాక వాటిని తీయడం చాలా కష్టం. అలాంటప్పుడు ఈ ‘సిలికాన్‌ మైక్రోవేవ్‌ బౌల్‌ హగ్గర్ల’ను వాడుకోవచ్చు. వేడిని తట్టుకునేలా ప్రత్యేకంగా తయారుచేసిన వీటిని- అవెన్‌లో ఉంచినా ఏ సమస్యా ఉండదు. పైగా వీటి సాయంతో పొగలుకక్కే పదార్థాల గిన్నెల్ని సులువుగా బయటకు తీసుకోవచ్చు. అదేవిధంగా సూప్స్‌, నూడుల్స్‌లాంటివి కప్పుల్లో వేసుకున్నప్పుడు వీటిల్లో పెట్టుకుని తినొచ్చు, పిల్లల చేతికీ కాలుతుందన్న భయం లేకుండా ఇచ్చేయొచ్చు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..