ఇది చిట్టి బాల్కనీ తోట!

ఇంట్లో ఉన్న కొంచెం చోటులోనే పూలూ, పండ్లూ, కూరగాయలూ, అలంకరణ మొక్కలూ పెంచుకుంటున్న ప్లాంట్‌ లవర్స్‌ పెరిగిపోయారు.

Published : 07 Jul 2024 00:36 IST

ఇంట్లో ఉన్న కొంచెం చోటులోనే పూలూ, పండ్లూ, కూరగాయలూ, అలంకరణ మొక్కలూ పెంచుకుంటున్న ప్లాంట్‌ లవర్స్‌ పెరిగిపోయారు. అలాంటివారి కోసమే ఎప్పటికప్పుడు వెరైటీ మొక్కల్లోనే కాదు, వాటిని పెంచే కుండీల్లోనూ కొత్తదనం కనిపించేస్తోంది. ఇక్కడున్న ‘గార్డెన్‌ బెడ్స్‌’ అలా వచ్చినవే మరి. కింద నచ్చిన మొక్కల్ని నాటుకోవడంతోపాటు పై నుంచి కుండీల్ని వేలాడదీసుకునేలా, ఇంకా తీగల మొక్కలు పైకి పాకేలానూ దీంట్లో వర్టికల్‌ వాల్‌ ఏర్పాట్లు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రకరకాల మొక్కలతో ఇదే ఓ చిట్టితోటలా తయారవుతుంది. తక్కువ స్థలంలోనూ అందమైన బాల్కనీ కావాలనుకునేవాళ్లు ఎంచక్కా దీన్ని కొనుక్కోవచ్చు. దీంట్లో రకరకాల సైజులూ, ఆకారాలూ అందుబాటులో ఉన్నాయి. పైగా వీటిల్లో కొన్ని- నచ్చిన చోటుకు జరిపేలా చక్రాలతోనూ వస్తాయి. ఈ ఒక్క గార్డెన్‌ బెడ్‌- మీ బాల్కనీకి చక్కని లుక్కును తెస్తుందంటే నమ్మండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..