ధ్యానంతో మంచి బ్యాక్టీరియా?!

బౌద్ధ సన్యాసులు శారీరకంగా ఆరోగ్యంగా ఉండటంతోపాటు మానసికంగానూ ప్రశాంతంగా కనిపిస్తారు. కారణం తెలుసుకునేందుకు కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన నిపుణులు తొలిసారిగా వాళ్లని పరిశీలించారు.

Published : 29 Jan 2023 01:18 IST

ధ్యానంతో మంచి బ్యాక్టీరియా?!

బౌద్ధ సన్యాసులు శారీరకంగా ఆరోగ్యంగా ఉండటంతోపాటు మానసికంగానూ ప్రశాంతంగా కనిపిస్తారు. కారణం తెలుసుకునేందుకు కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన నిపుణులు తొలిసారిగా వాళ్లని పరిశీలించారు. అందులో ధ్యానానికీ వాళ్ల పొట్టలోని బ్యాక్టీరియాకీ సంబంధం ఉందని తేలిందట. నిజానికి గత కొన్నేళ్లుగా ధ్యానం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందనే దానిమీద రకరకాల అధ్యయనాలు చేస్తున్నారు. కానీ కారణం స్పష్టంగా తెలియలేదు. అయితే పొట్టకీ మెదడుకీ సంబంధం ఉందనీ ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. దీన్నిబట్టి గంటలసేపు ధ్యానం చేసే బౌద్ధుల పొట్టమీద ఆ ప్రభావం ఉంటుందని భావించి, వాళ్ల పొట్టలోని మైక్రోబయోమ్‌ శాంపుల్స్‌ను పరిశీలించారట. అదెలా అంటే- బౌద్ధ సాధువుల్నీ అదే ఆహారం తీసుకున్న ఇతర వ్యక్తులనీ పరిశీలించినప్పుడు- బ్యాక్టీరియాలో వైవిధ్యం కొట్టొచ్చినట్లు కనిపించిదట. ప్రివొటెల్లా, బ్యాక్టీరాయిడ్స్‌... వంటివి ధ్యానం చేసేవాళ్లలో ఎక్కువగా ఉన్నాయట. ఇవి ఎక్కువగా ఉన్నవాళ్లలో మానసిక ఆరోగ్యం బాగుండి, డిప్రెషన్‌, ఆందోళన... వంటివి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి ధ్యానంవల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుందనీ తద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందనీ అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..