భారీ సైజుకు సూర్యుడే కారణం!

గుమ్మడికాయలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, క్యారట్‌, బీట్‌రూట్‌ తదితర కాయగూరల్ని అందరూ పండిస్తారు. సాగు విధానంలో మార్పులూ ఉండొచ్చు.

Updated : 22 Jan 2023 03:58 IST

భారీ సైజుకు సూర్యుడే కారణం!

గుమ్మడికాయలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, క్యారట్‌, బీట్‌రూట్‌  తదితర కాయగూరల్ని అందరూ పండిస్తారు. సాగు విధానంలో మార్పులూ ఉండొచ్చు. అయితే అలస్కాలో పండే ఈ కాయగూరలు మాత్రం ఓ ప్రత్యేకతనూ, గుర్తింపునూ సొంతం చేసుకున్నాయి. అందుకు కారణం వాటి పరిమాణమే.  ఏటా ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కాయగూరల ప్రదర్శన జరుగుతుంది. రైతులంతా తాము పండించిన జంబో వెజిటబుల్స్‌ను అక్కడ ప్రదర్శిస్తారు. అత్యంత బరువున్న వాటికి బహమతి కూడా ఉంటుంది. 63 కేజీల క్యాబేజీ, దాదాపు టన్ను బరువున్న గుమ్మడికాయ, 30 కేజీలున్న క్యాబేజీ, 200 కేజీల పుచ్చకాయ... ఇలా మనం నిత్యం చూసే వాటితో పోలిస్తే వీటి బరువులో ఊహించనంత తేడా ఉంటుంది. మరి ప్రపంచంలో కేవలం అలస్కాలో మాత్రమే బాహుబలి కాయగూరలు పండటానికి కారణం అక్కడి భౌగోళిక పరిస్థితులు. ఆ రాష్ట్రం ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండటంతో అక్కడ సూర్యరశ్మి 19-24 గంటలపాటు ఉంటుంది. చీకటి రాత్రులు చాలా తక్కువ. దాంతో మొక్కలపై సూర్యకిరణాలు ఎక్కువ సమయం పడి కిరణజన్య సంయోగ క్రియ అధికంగా జరగడంతో- భారీ సైజులో పంటలు పండుతాయి. ఈ కారణంతోనే అలస్కా ఆ ప్రత్యేకతను సొంతం చేసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు