పైన కరెంటు.. కింద కూరగాయలు

సౌర విద్యుత్తుతో నడిచే కొచ్చి విమానాశ్రయం.. ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రీన్‌ ఎయిర్‌పోర్టుగా చరిత్ర సృష్టించింది. ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ పురస్కారాన్నీ  అందుకుంది

Published : 29 Jan 2023 00:06 IST

పైన కరెంటు.. కింద కూరగాయలు

సౌర విద్యుత్తుతో నడిచే కొచ్చి విమానాశ్రయం.. ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రీన్‌ ఎయిర్‌పోర్టుగా చరిత్ర సృష్టించింది. ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ పురస్కారాన్నీ  అందుకుంది. నలభై ఐదు ఎకరాల్లో ఉన్న ఈ విమానాశ్రయం ఇప్పుడు మరో ప్రత్యేకతనూ సొంతం చేసుకుంది. దాదాపు ఇరవై ఎకరాల స్థలంలో పరుచుకున్న సోలార్‌ ప్యానెళ్ల కింద సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు మొదలుపెట్టారు. ప్యానెళ్లను శుభ్రం చేయడానికి వాడే నీరు వృథా కాకుండా... వాటి కింద సాగవుతున్న పంటకు అందేలా ఏర్పాట్లు చేశారు. పైగా పచ్చని వాతావరణం కారణంగా విద్యుదుత్పత్తి కూడా పెరిగి... భూమి కూడా కోతకు గురవ్వకుండా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. బెండ, వంకాయ, బీన్స్‌, కీర, టొమాటో, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ వంటి తక్కువ ఎత్తులో పండే వాటిని సాగు చేసి టన్నుల కొద్దీ కాయగూరల్ని ఉత్పత్తి చేస్తున్నారు. విమానాశ్రయానికి అదనపు ఆదాయాన్నీ తీసుకొస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..