గోమూత్ర స్నానాలు!

హిందువులకు ఆవు పరమ పవిత్రమైనది. దక్షిణ సూడాన్‌లోని ‘ముందరి’ తెగవాసులకు కూడా అది అత్యంత విలువైనదే.

Published : 29 Jan 2023 00:16 IST

గోమూత్ర స్నానాలు!

హిందువులకు ఆవు పరమ పవిత్రమైనది. దక్షిణ సూడాన్‌లోని ‘ముందరి’ తెగవాసులకు కూడా అది అత్యంత విలువైనదే. ముఖ్యంగా గోమూత్రాన్ని అయితే వాళ్లు బంగారంగా భావిస్తారు. ఆవులను పెంచే మగవాళ్లు అవి మూత్రవిసర్జన ఎప్పుడు చేస్తాయో కనిపెట్టుకుని ఉంటారు. ఆవు మూత్రాన్ని విసర్జించడం ప్రారంభించగానే తమ తలను తీసుకెళ్లి దాని కింద పెట్టేస్తారు. జుట్టుకు మంచి రంగు రావడానికి అది ఉపయోగపడుతుందని వాళ్లు నమ్ముతారు. అందుకే ఆ తెగ వారి జుట్టు రాగి రంగులోకి మారుతుంది. అలాంటి ప్రత్యేక రంగు జుట్టు కలిగిన పురుషులనే ‘ముందరి’ మహిళలు ఇష్టపడతారట. అన్నట్టు దూరప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి రావడంతో ఒక్కోసారి వాళ్లు గోమూత్రంతోనే స్నానాలూ చేసేస్తారు. ‘ముందరి’ ప్రజలుండే ప్రాంతం పర్యటకంగా వెనకబడిందే అయినా వారు పాటించే ఈ పద్ధతుల్ని చూడ్డానికి చాలామంది అక్కడకు వెళుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..