రైలు పట్టాలపై రయ్‌రయ్‌!

రైలు పట్టాల మీద మోటర్‌ సైకిళ్లు పరుగులు తీయడం ఎప్పుడైనా చూశారా? అంటే పట్టాల మధ్యలో కాదు.. వాటి పైనే..! కొలంబియాలోని మారుమూల గ్రామం శాన్‌ సిప్రియానోకు వెళ్తే ఆ వింత వాహనాలను చూడొచ్చు.

Published : 04 Feb 2023 23:39 IST

రైలు పట్టాలపై రయ్‌రయ్‌!

రైలు పట్టాల మీద మోటర్‌ సైకిళ్లు పరుగులు తీయడం ఎప్పుడైనా చూశారా? అంటే పట్టాల మధ్యలో కాదు.. వాటి పైనే..! కొలంబియాలోని మారుమూల గ్రామం శాన్‌ సిప్రియానోకు వెళ్తే ఆ వింత వాహనాలను చూడొచ్చు. ఆరొందల మంది నివసించే ఆ గ్రామం నుంచి దగ్గర్లోని పట్టణానికి వెళ్లాలంటే రైలు తప్ప మరో మార్గం లేదు. దాదాపు అరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించాలి. కానీ, రైలు అన్నివేళలా అందుబాటులో ఉండకపోవడంతో వాళ్లు చాలా ఇబ్బంది పడేవాళ్లు. దాంతో నిరంతర ప్రయాణం కోసం ప్రత్యామ్నాయ మార్గం వెతికిన గ్రామస్థులు- పెద్ద చెక్కబల్లలను కలిపి కింద చక్రాలను అమర్చి కర్రలతో రైలు పట్టాల మీద నెట్టుకుంటూ వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అది కొంచెం కష్టమైన పనే కానీ బాగానే వాడుకలోకి వచ్చింది. కొన్నాళ్ల క్రితం చెక్క బల్లనూ, మోటార్‌ సైకిల్‌నూ అనుసంధానించి- మోటర్‌ సైకిల్‌ ట్రాలీగా ఆధునికీకరించారు. ఒక్కసారి బండి ఎక్కి దాన్ని స్టార్ట్‌ చేస్తే... రయ్యిరయ్యిమంటూ పట్టాల మీద దూసుకుపోవడమే.

ఆ ప్రయాణాన్ని ఆస్వాదించడానికి పర్యటకులు అక్కడికి వెళుతున్నారు. శాన్‌ సిప్రియానో వాసులతోపాటు ఆ రైలు పట్టాల వెంబడి ఉన్న మరికొన్ని గ్రామాల ప్రజలకూ ఇప్పుడదో ఆదాయ మార్గమైంది. భలే బాగుంది కదా !


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..