అక్కడ దొంగతనానికే గుడికి వెళ్తారట.. !

ఎవరైనా ఆలయానికి దేవుణ్ని దర్శించుకోవడానికో, మొక్కులు చెల్లించుకోవడానికో వెళుతుంటారు. మరి ఉత్తరాఖండ్‌లోని చూడామణి ఆలయానికి మాత్రం దొంగతనం చేయడానికి వెళతారట.

Updated : 05 Mar 2023 21:33 IST

అక్కడ దొంగతనానికే గుడికి వెళ్తారట.. !

ఎవరైనా ఆలయానికి దేవుణ్ని దర్శించుకోవడానికో, మొక్కులు చెల్లించుకోవడానికో వెళుతుంటారు. మరి ఉత్తరాఖండ్‌లోని చూడామణి ఆలయానికి మాత్రం దొంగతనం చేయడానికి వెళతారట. నమ్మలేకపోతున్నారు కదూ... రూర్కీ సమీపంలో ఉన్న చూడామణి దేవి ఆలయంలో వందల ఏళ్లుగా ఈ ఆచారం ఉంది. సంతానంలేని దంపతులు అమ్మవారి పాదాల వద్ద ఉన్న చెక్క బొమ్మను దొంగిలిస్తే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. సంతాన ఆలయంగా పేరొందిన ఈ గుడి గురించి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. లాందౌరా అనే రాజు వేటకు వెళుతుండగా చూడామణి ఆలయం కనిపించి అమ్మవారిని ప్రార్థించాడట. ఆ తరవాత అక్కడ చెక్క రూపంలో దర్శనమిచ్చిన ఆ అమ్మవారిని రాజు ఇంటికి తీసుకెళ్లగానే అతడి భార్య గర్భం దాల్చిందట. పండంటి బిడ్డకు జన్మనిచ్చాక ఆ దంపతులు అమ్మవారికి చెక్క బొమ్మను సమర్పించారట. అందుకే ఆ ఆలయంలో బొమ్మల్ని దొంగిలించడం.. పిల్లలు పుట్టాక సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..