ఇది ‘డబ్బా బిర్యానీ’

హైదరాబాదీ బిర్యానీ, కుండ బిర్యానీ, బకెట్‌ బిర్యానీ, వెదురు బిర్యానీ... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల బిర్యానీల గురించి విన్నాం, తిన్నాం. అందుకు తగ్గట్టు రోజుకో రకం బిర్యానీ పాయింట్‌ మన దరిదాపుల్లోకి వస్తోంది.

Published : 25 Mar 2023 23:48 IST

ఇది ‘డబ్బా బిర్యానీ’

హైదరాబాదీ బిర్యానీ, కుండ బిర్యానీ, బకెట్‌ బిర్యానీ, వెదురు బిర్యానీ... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల బిర్యానీల గురించి విన్నాం, తిన్నాం. అందుకు తగ్గట్టు రోజుకో రకం బిర్యానీ పాయింట్‌ మన దరిదాపుల్లోకి వస్తోంది. అయితే ఈమధ్య రుచిలోనే కాదు... వాటిని వడ్డించే తీరులోనూ వైవిధ్యం కనిపిస్తోంది. ఎక్కడైనా బిర్యానీ సింగిల్‌, డబుల్‌, ఫ్యామిలీ ప్యాక్‌ల ప్యాకేజీతో ఇస్తారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ‘బిర్యానీ బై కిలో’ రెస్టరంట్‌లో మాత్రం కేజీల చొప్పున కొనుక్కోవచ్చు. వృథా కాకుండా ఎంత కావాలంటే అంత అందివ్వాలనే ఉద్దేశంతో ఈ విధంగా అందిస్తోన్న ఆ రెస్టరంట్‌కు హైదరాబాద్‌లోనూ పలు బ్రాంచీలున్నాయి. ఇక, విశాఖకు చెందిన ఓ రెస్టరంట్‌ ప్లాస్టిక్‌కు బదులుగా స్టీలు డబ్బాల్లో బిర్యానీ ప్యాక్‌ చేసి ఇస్తోంది. ఇద్దరికి సరిపోయే చిన్న డబ్బా నుంచి 15 మందికి సరిపోయే పెద్ద స్టీలు డబ్బా వరకూ రకరకాల పరిమాణాల్లో దాన్ని అందిస్తున్నారు. బిర్యానీ కొంటే డబ్బా ఉచితం అన్నమాట. అలానే ఈ మధ్య ఫుడ్‌ ఏటీఎంలూ పాపులర్‌ అయ్యాయి. అందులో భాగంగానే చెన్నైలో బిర్యానీ ఏటీఎమ్‌ను ప్రారంభించింది ఓ రెస్ట్టరంట్‌. ఇంకేముంది బిర్యానీ తినాలనిపించిన వారు ఏటీఎమ్‌కి వెళ్లి డబ్బులు వేయగానే వేడివేడి బిర్యానీ ప్యాకెట్‌ బయటకొచ్చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు