దుంప పండింది నల్లగా

బంగాళాదుంప ప్రతి ఇంట్లోనూ ఉండేదే. కొందరైతే ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకుంటారు. చిన్నల నుంచి పెద్దల వరకూ అంతగా ఇష్టపడే ఈ దుంపల్ని బిహార్‌కి చెందిన ఆశిష్‌ సింగ్‌ సాగు చేశాడు. నాలుగు నెలలకు చేతికొచ్చిన పంటను చూసిన జనాలంతా నివ్వెరపోయారు.

Published : 25 Mar 2023 23:51 IST

దుంప పండింది నల్లగా

బంగాళాదుంప ప్రతి ఇంట్లోనూ ఉండేదే. కొందరైతే ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకుంటారు. చిన్నల నుంచి పెద్దల వరకూ అంతగా ఇష్టపడే ఈ దుంపల్ని బిహార్‌కి చెందిన ఆశిష్‌ సింగ్‌ సాగు చేశాడు. నాలుగు నెలలకు చేతికొచ్చిన పంటను చూసిన జనాలంతా నివ్వెరపోయారు. కారణం వాటి రంగే. గయ దగ్గరలోని గుర్లియాచక్‌లో ఆశిష్‌ సాగు చేసిన దుంపలు మాత్రం నల్లగా బొగ్గురంగులో పండాయి. అదేమన్నా తెగులేమో అనుకునేరు. దాని రంగే అంత. దుంప నల్లగానే ఉన్నా లోపల తెల్లగానే ఉంటుంది. రోజూ యూట్యూబ్‌లో కొత్త విషయాలు తెలుసుకునే ఆశిష్‌- ఆండిస్‌ పర్వతశ్రేణుల్లో పండించే నల్ల బంగాళాదుంపల వీడియోలు చూశాడు. ఆ దుంపల గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువనీ, చక్కెర ఉన్నవాళ్లు కూడా తినొచ్చని తెలిశాక తానూ సాగు చేయాలనుకున్నాడు. ఆన్‌లైన్‌ ద్వారా ఓ పద్నాలుగు కేజీల గింజల్ని తెప్పించి గత నవంబర్‌లో సాగు చేశాడు. ఈ మధ్యనే పంట చేతికొచ్చింది. కేజీ 300-500ల రూపాయలకు అమ్మడానికి సిద్ధమైన ఆశిష్‌ను చూసి మిగతా రైతులు కూడా నల్ల దుంప సాగుకు సిద్ధమయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..