చీరతో దేశాలు చుట్టొస్తోంది

చీరతో బైకు నడపడం అంత సౌకర్యంగా ఉండదు. కానీ, ఈ మధ్య కొందరు ఆరు గజాల చీర ధరించి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మీద దూసుకుపోవడం చూస్తున్నాం. కొద్ది దూరమైతే పర్వాలేదుగానీ ప్రపంచదేశాల్ని అలా చీరతోనే చుట్టి రావడం మాటల్లో చెప్పలేనంత కష్టం.

Published : 25 Mar 2023 23:53 IST

చీరతో దేశాలు చుట్టొస్తోంది

చీరతో బైకు నడపడం అంత సౌకర్యంగా ఉండదు. కానీ, ఈ మధ్య కొందరు ఆరు గజాల చీర ధరించి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మీద దూసుకుపోవడం చూస్తున్నాం. కొద్ది దూరమైతే పర్వాలేదుగానీ ప్రపంచదేశాల్ని అలా చీరతోనే చుట్టి రావడం మాటల్లో చెప్పలేనంత కష్టం. అయినా సరే మన సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని- తొమ్మిది గజాల చీర ధరించి నడుం బిగించింది ముంబయికి చెందిన రమీలా లాత్‌ప్టే. 365 రోజుల్లో దాదాపు నలభై దేశాల్ని చుట్టి రావాలనుకున్న రమీలా చీరతోనే దాదాపు లక్ష కిలోమీటర్లు ప్రయాణించి, వచ్చే ఏడాది మహిళా దినోత్సవం నాటికి తిరిగి ఇంటికి చేరేలా ప్రణాళికలు వేసుకుంది. వ్యాపారవేత్తగా, పైలట్‌గా రాణిస్తున్న రమీలా ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌, అమెరికా, కెనడా, ఇంగ్లండ్‌, పోలండ్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, పోర్చుగల్‌, మొరాకో వంటి దేశాల మీదుగా ప్రయాణిస్తుంది. చివరగా సౌదీ, ఒమన్‌, దుబాయ్‌ చేరుకుని అక్కడి నుంచి ఇండియాలోకి అడుగుపెడుతుంది. సాహసోపేతమైన ఒంటరి ప్రయాణంలో రమీలా అనుకున్నది సాధించాలని మనమూ కోరుకుందాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు