గోమాతకు గోరింటాకు

కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆవులపైన రంగులు చల్లడం, కొమ్ములకు పెయింట్లు వేయడం తెలిసిందే. కొందరైతే వాటి నుదురు, వెన్నుపైన చిన్న గోరింటాకు ముద్ద పెడుతుంటారు

Updated : 03 Apr 2023 13:42 IST

గోమాతకు గోరింటాకు

కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆవులపైన రంగులు చల్లడం, కొమ్ములకు పెయింట్లు వేయడం తెలిసిందే. కొందరైతే వాటి నుదురు, వెన్నుపైన చిన్న గోరింటాకు ముద్ద పెడుతుంటారు. అయితే వాటి¨ శరీరంపైన మెహందీ డిజైను పెట్టడం ఎక్కడైనా చూశారా... పోనీ ఎప్పుడైనా విన్నారా. రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా ప్రాంతంలో వ్రజ్‌ సామాజిక వర్గం గోవులపై ఆధారపడి జీవిస్తుంటుంది. వారంతా వాటిని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. ప్రత్యేక సందర్భాల్లో ఆవులకు మెహందీ డిజైన్లు వేయడం వారి ఆనవాయితీ. ఇది దాదాపు 350 ఏళ్లుగా అక్కడ కొనసాగుతోంది. పశువులకు మెహందీ డిజైన్లు పెట్టేటప్పుడు బంధుమిత్రుల్ని పిలుచుకుంటారు. పాటలు పాడుతూ శబ్దాలు చేస్తుంటారు. కృష్ణుడు, చేతి ముద్రలు, పిల్లల రూపాలు, పూలతలూ వంటి ఎన్నో డిజైన్లతో వాటిని అలంకరిస్తుంటారు.
ఈ విషయంలో ఆడవాళ్లతోపాటు మగవారూ పోటీపడుతుంటారు. దీపావళి సమయంలో అయితే పదిహేనురోజుల ముందు నుంచే గోమాతలను గోరింటాకుతో అలంకరిస్తుంటారు. అవి కూడా కదలకుండా పెట్టించుకోవడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు