పద పద... పాడ్‌ టాక్సీలో!

చూడటానికి బుల్లి కార్ల్ల మాదిరి కనిపిస్తాయి.. కానీ  కావు. మెట్రో రైళ్లలా పరుగులు తీస్తుంటాయి.. కానీ రైళ్లూ కావు. మరి అవేంటంటే... పాడ్‌ టాక్సీలు.

Updated : 21 May 2023 04:33 IST

చూడటానికి బుల్లి కార్ల్ల మాదిరి కనిపిస్తాయి.. కానీ  కావు. మెట్రో రైళ్లలా పరుగులు తీస్తుంటాయి.. కానీ రైళ్లూ కావు. మరి అవేంటంటే... పాడ్‌ టాక్సీలు. ప్రజారవాణా రంగంలో గేమ్‌ఛేంజర్లుగా గుర్తింపు పొందిన వాహనాలివి. యూకే, అబుదాబీ, నెదర్లాండ్స్‌ లాంటి దేశాల్లో ఇప్పటికే అవి పని చేస్తున్నాయి. ఈ పాడ్‌ టాక్సీల్లో డ్రైవర్లు ఉండరు. ఆటోమేటెడ్‌ కార్లలా ఉంటాయివి. కానీ, ప్రత్యేకంగా నిర్మించిన ‘గైడెడ్‌ వే’లలో కరెంట్‌తో మెట్రో రైళ్ల పద్ధతిలో నడుస్తాయి. కాలుష్యానికి దూరంగా ఉండే ఈ సరికొత్త వాహనాలు పూర్తిగా పర్యావరణహితం. రోడ్డు మార్గంలో అరగంట పట్టే ప్రయాణం.. పాడ్‌ టాక్సీలో పది నిమిషాలే. ఖర్చు కూడా చాలా తక్కువ. నలుగురి నుంచి ఆరుగురి వరకూ ప్రయాణించగల ఈ టాక్సీలను మొదటిసారి ఉత్తర్‌ ప్రదేశ్‌లో- నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, సెక్టార్‌ 21లోని ఫిల్మ్‌సిటీల మధ్యలో నడపనున్నారు. 12-14 కిలోమీటర్ల పొడవున ఉండే ఈ దారిలో రోజుకు సుమారు 40 వేల మంది ప్రయాణికులను పాడ్‌ టాక్సీలు అటూఇటూ చేరవేస్తాయని అంచనా. దారి మధ్యలో ఉండే పన్నెండు స్టాప్‌లను సూచిస్తూ బటన్లు ఉంటాయి. ఎక్కగానే మన స్టాప్‌ బటన్‌ నొక్కాలి అంతే. అదే ఆ స్టాప్‌ దగ్గర ఆటోమేటిగ్గా ఆగిపోయి ప్రయాణికుల్ని దింపేస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు